కేసీఆర్ నిర్ణయం హర్షనీయం.... - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ నిర్ణయం హర్షనీయం….

September 13, 2017

తెలుగు భాషాకు తెలంగాణ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించే ప్రయత్నం హర్షనీయం. చాలా  యేండ్లనుండి తెలుగు భాషా రక్షణ గురించి అందరూ చెప్తున్నారు. బాధపడుతున్నారు. ప్రభుత్వాలను కోరారు. ఏ ప్రభుత్వమూ  ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. కేసీఆర్ తెలుగు భాష  విషయంలో చొరవ తీసుకుని మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు జాతికి మంచి నిర్ణయాన్ని అందించారు.

ప్రయివేటు బడుల్లో ఇంగ్లీషు ఓఫ్యాషన్ అయింది. తాము పుట్టి పెరిగిన భాష విషయంలో  చిన్న చూపును ప్రదర్శిస్తున్నారు. దీన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వం పూనుకున్నది. ఒకటో  తరగతి నుండి ఇంటర్ వరకు ఓ సడ్జెక్టు గా తెలుగు తప్పని సరి చేయాలని అంటున్నది.  బడుల బోర్డులు తప్పనిసరిగా తెలుగు భాషలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.

తెలుగు భాషకు ప్రాచీన హోదా వచ్చినా… అది పోతున్నదని ఆవేదన పడినా  ఏ ప్రయోజనం లేదని బాధపడుతున్న తరుణంలో కేసీఆర్ తీసుకున్న  నిర్ణయం పట్ల సర్వదా హర్షం వ్యక్తం అవుతున్నది. ఈ తరం పిల్లలు  అట తెలుగు రాక ఇటు ఇంగ్లీషూ రాక ఎటూ  కాకుండా పోతున్నారు. కనీసం తెలుగు భాష అయనా బాగా నేర్చుకుంటే చెప్పదల్చుకున్న  విషయాన్ని సూటిగా చెప్తారు.

డిసెంబర్ లో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. హైద్రాబాద్ లో 15 నుండి 19వ వరకు నిర్వహిస్తారు. ప్రారంభ ముగింపు వేడుకలను రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతులను పిలుస్తున్నారు. తెలంగాణ భాషా, సాహిత్యాలు, కల్చర్  ప్రతిబింబించేలా కార్యక్రమాలు నిర్వహించాలని అనుకుంటున్నది ప్రభుత్వం.

తెలంగాణ కేంద్రంగా పుట్టిన తెలుగు భాష వికాసాలకు చాలా యేండ్ల  తర్వాత మంచి గౌరవం  లభిస్తున్నది. అయితే  ఏ భాష అయినా కేవలం చదడంతోటి సరిపోదు. దాన్ని వాణిజ్య లక్షణాన్ని కూడా ఇవ్వాలి. టెక్నాలజీ తెలుగులో అభివృద్ధి చేసేలా కోర్సులు తయారు చేయాలి…. అంతేకాదు  ఈ భాషనునేర్చుకుంటే బతుకు దెరువు గ్యారెంటీ అనే భరోసా కూడా ఇవ్వాల్సిన  అవసరం ఉంది.