కేసీఆర్ డైరెక్షన్..బావబామ్మర్ది ఆపరేషన్ - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ డైరెక్షన్..బావబామ్మర్ది ఆపరేషన్

November 6, 2022

KCR Thr

మునుగోడు బై పోల్‌లో సీఎం కేసీఆర్ సూపర్ స్ట్రాటజీ కారుని జెట్ స్పీడ్‌తో నడిపించింది కేసీఆర్ డైరెక్టన్‌లో బావబామ్మర్ధి ఆపరేషన్ సక్సెస్ ఫుల్‌గా సాగింది. కమలాన్ని కోలుకోకుండా మునుగోడు అడ్డాపై దెబ్బకొట్టారు. ఇంతకీ కేసీఆర్ డైరెక్టన్లో ఏం జరిగింది? బావబామ్మర్ది కలిసి కమలాన్ని ఎలా బోల్తా కొట్టించారు.?

పక్కా స్కెచ్

ఎన్నికల షెడ్యూల్ రాగానే టీఆర్ఎస్ పక్కాగా క్యాంపెయిన్ ప్లాన్ చేసింది. మునుగోడు అడ్డాపై మంత్రులు, ఎమ్మెల్యేల్ని టీమ్ లు దించింది.మండలాల బాధ్యతలు మంత్రులకు అప్పగించింది. ఊరురా గులాబీ దళం తిరిగేలా ప్రణాళిక సాగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటర్ల అందరినీ కలిసే ప్రయత్నం చేశారు. గ్రామాల్లోనే ఉంటూ మాట ముచ్చట కలిపారు. విందులతో వారిని ఖుషీ చేశారు.ఓటర్లకు హామీలు ఇస్తూనే పక్కాగా కారుకు ఓటు పడేలా చేశారు. ఇదంతా కేసీఆర్ డైరెక్షన్ లోనే సాగింది.

ఆ తప్పులు ఇక్కడ రిపీట్ కాలేదు

హుజూరాబాద్ ఉపఎన్నికలో చేసిన పొరపాట్లను టీఆర్ఎస్ ఇక్కడ చేయలేదు. ఆ తప్పులు మళ్లీ జరగక్కుండా చూసింది. అణువంతైనా హుజూరాబాద్ రాంగ్ స్ట్రాటజీకి అవకాశం ఇవ్వలేదు. సీఎం కేసీఆర్ మార్క్ స్కెచ్ పక్కాగా అమలైంది. మంత్రి హరీష్ రావు, మంత్రి కేటీఆర్ లు కలిసి పనిచేశారు. తమ మధ్య విభేదాల్లేవని జనాల్లోకి తీసుకెళ్లారు. మునుగోడు ప్రచారంలోనే కేటీఆర్..హరీష్ రావుకు ఫోన్ చేశారు. బావ ఓ చిన్న రిక్వె స్ట్ అంటూ మాట్లాడారు. సోషల్ మీడియాలో ఈ వీడియా వైరల్ అయింది. కేటీఆర్ అడిగిన తీరు..హరీష్ సమాధానం ఇచ్చిన పద్దతి పాజిటివ్ వైబ్స్ ని సృష్టించాయి. ఎప్పటికప్పడు హరీష్ , కేటీఆర్‌లను సీఎం కేసీఆర్ సమన్వయం చేశారు. వ్యూహాలు సమర్థవంతంగా అమలయ్యేలా చూశారు.

సిద్ధిపేటకు వెళ్లలేదు…

మునుగోడు పోలింగ్ అయ్యేదాకా మంత్రి హరీష్ రావు సిద్ధిపేట వెళ్లలేదు. మునుగోడు ప్రచారంలో తలమునకలయ్యారు. ఊరురా తిరుగుతూ టీఆర్ఎస్ శ్రేణుల్ని ఉత్సహపరిచారు. పనులెన్ని ఉన్నా ముగించుకుని తరచుగా సిద్ధిపేట వెళ్లడం హరీష్ రావుకు అలవాటు. మునుగోడు పోల్ బెల్ మోగాక సిద్ధిపేటవైపు కన్నెత్తి చూడలేదు. పోలింగ్ ముగిసే మునుగోడు చుట్టే తిరిగారు. ఇలా బావబామ్మర్థిల్ని సమన్వయం చేస్తూ కేసీఆర్ నడిపించారు.కేసీఆర్ ఫ్యామిలీ అంతా మునుగోడు ప్రచారంలో మునిగితేలారు కానీ. ఎమ్మెల్సీ కవిత మాత్రం క్యాంపెయిన్‌లో ఎక్కడ కనిపించలేదు. లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలతో దూరంగా ఉన్నారని ప్రత్యర్థి పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు.