కేసీఆర్ మీ పోరాటం ఆపకండి.. మీ వెంటే ఉంటాం: టికాయత్ - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ మీ పోరాటం ఆపకండి.. మీ వెంటే ఉంటాం: టికాయత్

April 11, 2022

03

తెలంగాణ రాష్ట్రంలో పండించిన యాసంగి వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనాలని గతకొన్ని రోజులుగా కేసీఆర్ సర్కార్ డిమాండ్ చేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు ధర్నాలు, రాస్తారోకులు, నిరసనలు చేపడుతున్నాం విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయత్ మాట్లాడుతూ.. ”కొట్లాడండి కేసీఆర్. మీ వెంటే ఉంటాం. కేసీఆర్ చేస్తున్నది రాజకీయ ఉద్యమం కాదు. రైతుల పక్షాన కేసీఆర్ చేస్తున్న ఈ ఉద్యమానికి నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. కేంద్ర విధానంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ధాన్యం కొనుగోలుకు దేశవ్యాప్తంగా ఒకే విధానం లేకపోతే రైతులు రోడ్లపైకి రావాల్సి వస్తుంది. ఏడాదికి 70వేలు ఇస్తూ రైతులను ఉద్దరిస్తున్నట్లు కేంద్రం మాట్లాడుతోంది. రైతుల కోసం మీరు కొట్లాడండి. మేం మీ వెంటే ఉంటాం” అని టికాయత్ అన్నారు.

మరోపక్క సోమవారం ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ ఢిల్లీలో దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో భాగంగా భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయత్ కూడా పాల్గొన్నారు. అనంతరం కేంద్ర ప్ర‌భుత్వ తీరుపై ఆయన మండిప‌డ్డారు. దేశంలో ఏం జ‌రుగుతోందని ప్ర‌శ్నించారు. దేశంలో రైతులు త‌మ హ‌క్కుల కోసం పోరాడుతూనే ఉన్నార‌ని అన్నారు.