కేసీఆర్ మద్దతుపై పవార్ ప్రకటన.. ఎన్డీఏ అభ్యర్ధిగా అజిత్ దోవల్? - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ మద్దతుపై పవార్ ప్రకటన.. ఎన్డీఏ అభ్యర్ధిగా అజిత్ దోవల్?

June 21, 2022

విపక్షాల తరపున భారత రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్ధి అధికారికంగా ఖరారయ్యారు. ఉదయం నుంచి వినిపించిన యశ్వంత్ సిన్హాను ఉమ్మడి అభ్యర్ధిగా నిలబెడుతున్నట్టు మంగళవారం ప్రకటించారు. ఢిల్లీలో రెండో దఫా జరిగిన విపక్షాల ఉమ్మడి భేటీలో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అనంతరం సభకు అధ్యక్షత వహించిన ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ మీడియాతో మాట్లాడారు. మొత్తం 22 పార్టీలు భేటీలో పాల్గొన్నాయని, ఎంఐఎం పార్టీ కూడా తన ప్రతినిధిని పంపిందని వెల్లడించారు. అదే సమయంలో టీఆర్ఎస్ పార్టీ మద్ధతు కూడా తమకే ఉందని స్పష్టం చేశారు. భేటీ జరుగుతున్నప్పుడు తాను కేసీఆర్‌కు ఫోన్ చేశానని, బేషరతుగా మద్ధతు పలుకుతున్నట్టు చెప్పారని తెలిపారు. మరోవైపు ఎన్డీఏ తరపున ఇప్పటివరకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేరు వినిపించగా, ఎవరూ ఊహించని విధంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రేసులోకి వచ్చారు. మరి ఏన్డీఏ తరపున అభ్యర్ధి ఎవరో మంగళవారం నాటికి తేలిపోనుంది.