కెసీఆర్ కంటి  సర్జరీ సక్సెస్ - MicTv.in - Telugu News
mictv telugu

కెసీఆర్ కంటి  సర్జరీ సక్సెస్

September 6, 2017

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కు కంటి ఆపరేషన్ విజయవంతమైంది. ఢిల్లీలోని సెంటర్ ఫర్ సైట్ ఆస్పత్రిలో బుధవారం ఆయనకు సర్జరీ చేశారు. డాక్టర్ సచ్ దేవ్.. కేసీఆర్ కుడికంటిలోని పొరను తొలగించారు. ఆపరేషన్ సక్సెస్ అయిందని సీఎం తనయుడు, ఐటీ మంత్రి కేటీఆర్ ట్విటర్లో తెలిపారు. కేసీఆర్ ఆపరేషన్ కోసం గత శుక్రవారం ఢిల్లీ వెళ్ళారు. శనివారం అరుణ్ జైట్లీని కలిసారు. ఆదివారం నుంచి విశ్రాంతి తీసుకున్నారు. రెండు రోజుల డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న తర్వాత సర్జరీ చేయించుకున్నారు.