KCR fire on Modi in Bihar.. time has come
mictv telugu

బీహార్‌లో మోదీపై కేసీఆర్ ఫైర్..టైం వచ్చేసింది

August 31, 2022

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీహార్ పర్యటక కాసేపటిక్రితమే ముగిసింది. బీహార్ సీఎం నితీష్ కుమార్, ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌‌తో సమావేశమైన కేసీఆర్…గాల్వాన్ అమర వీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం మోదీ సర్కార్‌పై ధ్వజమెత్తారు. మోదీని సాగనంపాల్సిన అ టైం వచ్చేసిందని అన్నారు.

కేసీఆర్ మాట్లాడుతూ..”8 ఏళ్లలో మోదీ సర్కార్ చేసిందేమీ లేదు. రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా పతనమైంది. మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో నష్టపోయింది. పేదలు, రైతులు, మహిళలకు మోదీ సర్కార్ ఏం చేసింది?, కేసీఆర్ ప్రశ్నించారు. బీజేపీ సర్కార్‌ను సాగనంపాల్సిన అవసరం ఉంది. దేశంలోని నదుల్లో 70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. 8 ఏళ్లలో దేశం ఏ రంగంలోనూ ప్రగతి సాధించలేదు. మోదీ నినాదాలు ఒక్కటి కూడా సఫలం కాలేదు. ఒక్క రంగాన్నైనా మోదీ అభివృద్ధి చేశారా?. 2022 నాటికి అందరికీ ఇళ్లు అనే నినాదం ఏమైంది?. అసలు బీజేపీ ఈ దేశాన్ని ఏం చేయాలని అనుకుంటోంది.” అని ఆయన అన్నారు.