kcr focuses On brs party Office Opening In andrapradesh
mictv telugu

ఏపీలో పార్టీ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించేది ఎప్పుడంటే..

December 25, 2022

తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో సత్తా చాటేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. టీఆర్ఎస్‎ను బీఆర్ఎస్‎గా మార్చి కార్యాకలాపాలను ముమ్మరం చేశారు. ముందుగా పొరుగు రాష్ట్రాలైనా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలను బీఆర్ఎస్ టార్గెట్ చేసింది. ఇప్పటికే ఆ ప్రాంతాలలో పార్టీ పనులు మొదలు పెట్టేశారు. తెలంగాణ సరిహద్దులో ఉన్న మహారాష్ట్ర గ్రామాలపై దృష్టిసారించారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు అక్కడ ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టారు. స్థానిక లీడర్లు, ప్రజలతో బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటించి సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ మొదట సభ కూడా నాందేడ్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరిలో జరిగే ఈ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. ఈ బాధ్యతను ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నేతలే భుజానేసుకున్నారు.

అమరావతిలో బీఆర్ఎస్ ఆఫీస్..

ఆంధ్రప్రదేశ్‌లోనూ పాగా వేసేందుకు కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఏపీకి చెందిన పలువురు రాజకీయ నేతలో సమావేశాలు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని వారిని ఆహ్వానించారు. ఇటీవల పలువురు ఏపీకి చెందిన నేతలు ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. పార్టీ కార్యాకలాపాలపై చర్చించారు. ఇక అమరావతిలోనే పార్టీ ఆఫీస్‌ను
బీఆర్ఎస్ నిర్మిస్తుంది. దీనిని జనవరి చివరిలో కేసీఆర్ ప్రారంభించనున్నారు. అక్కడి నుంచే పార్టీ కార్యక్రమాలు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 26 లేదా 27న ఏపీకి చెందిన కొందరు నేతలు కేసీఆర్‎ను కలిసే అవకాశం ఉందిని ప్రచారం జరుగుతోంది. ఏపీలో బీఆర్‌స్ కార్యకలాపాలను మంత్రి తలసాని శ్రీనివాస్ పర్యవేక్షిస్తున్నారు.

బీఆర్ఎస్ సభ్యత్వం కోసం టోల్ ఫ్రీ

ఏపీలో సభ్యత్వ నమోదును కూడా కసరత్తు చేస్తోంది బీఆర్ఎస్.. పార్టీ సభ్యత్వం తీసుకోవాలి అనుకునే వారికి 94910 15222 టోల్ ఫ్రీ నెంబర్‎ను ఏర్పాటు చేసింది. టోల్ ఫ్రీ నెంబర్‎కు కాల్ చేసి వారి వివరాలు నమోదు చేసుకునే వారికీ సభ్యత్వం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలో ఏ విధంగా అయితే ఇన్సూరెన్స్ తో కూడిన సభ్యత్వం ఇస్తున్నారో అదే విధంగా ఇక్కడా సభ్యత్వం ఇచ్చేందుకు ఆలోచన చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : 

బీజేపీకి ఎదురుదెబ్బ… కొత్త పార్టీని ప్రకటించిన గాలి జనార్ధన్ రెడ్డి

గుర్రంపై ‘గడప గడపకు’ వైసీపీ ఎమ్మెల్యే

రేపే రాష్ట్రానికి రాష్ట్రపతి రాక.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు