అర్చకులకు  కేసీఆర్ దసరా కానుక...! - MicTv.in - Telugu News
mictv telugu

అర్చకులకు  కేసీఆర్ దసరా కానుక…!

September 15, 2017

ప్రగతి భవన్ లో అర్చకులతో సమావేశమైన కేసీఆర్  వాళ్లకు  బంపర్ ఆఫర్ ఇచ్చాడు.  అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వచ్చే నవంబర్ నుంచి పేస్కేలు అమలు చేస్తామని చెప్పారు. అర్చకులకు గౌరవ మర్యాదలు దక్కుతున్నా.. పూట గడవడమే కష్టంగా ఉందన్నారు, వాళ్లకు పిల్లను ఇచ్చేందుకు కూడా  వెనుకాడుతున్నారని తెలిపారు. ఇక నుంచి 5,625 మంది అర్చకులు, ఆలయ ఉద్యోగులకు వేతనాలు అందిస్తామని చెప్పారు. అర్చకులు, ఆలయ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అందుతాయి.
ప్రస్తుత రాష్ట్రంలోని 1805 దేవాలయాల్లో అమలవుతున్న ధూప దీప నైవేద్య పథకాన్ని మరో 3 వేల దేవాలయాలకు వర్తింపు చేస్తామని తెలిపారు కేసీఆర్. దేవాలయాల నిర్వహణ, సంబంధిత అంశాల పర్యవేక్షణకు ధార్మిక పరిషత్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ఆలయాల భూముల అన్యాక్రాంతంపై గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని గుర్తు చేశారు సీఎం. సమైక్య పాలనలో తెలంగాణకు ఈ అన్యాయం ఎక్కువగా జరిగిందన్నారు. తెలంగాణ ఆలయాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణలో పుష్కరాలు సరిగా నిర్వహించలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పుష్కరాలను అద్భుతంగా నిర్వహించామని సీఎం తెలిపారు.