KCR good news for Telangana people..10 lakh new pensions..started on 15
mictv telugu

తెలంగాణ ప్రజలకు కేసీఆర్ శుభవార్త..10 లక్షల కొత్త పింఛన్లు..15న షురూ

August 12, 2022

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ ఓ శుభవార్తను చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా పది లక్షల పింఛన్లు మంజూరు చేస్తూ, గురువారం సాయంత్రం రాష్ట్ర మంత్రి మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ పది లక్షల కొత్త పింఛన్లు ఆగస్ట్ 15వ తేదీ నుంచి అమలు కానున్నాయని అధికారులు తెలిపారు.

అయితే, ఇప్పటికే రాష్ట్రంలో 36 లక్షల పింఛన్లు ఇస్తున్నామని, కొత్త వాటితో కలిపి మొత్తం పింఛన్ల సంఖ్య 46 లక్షలకు చేరిందని అధికారులు తెలిపారు. ఆగస్ట్ 15వ తేదీ నుంచి లబ్ధిదారులందరికీ ప్రత్యేకంగా కార్డులు ఇవ్వాలని క్యాబినెట్‌ నిర్ణయం తీసుకొంది.

అంతేకాదు, రాష్ట్రంలో జీవో 58,59 కింద పేదలకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీని వేగవంతం చేయాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను మంత్రివర్గం ఆదేశించింది. గ్రామకంఠం స్థలాల్లో నూతన ఇండ్ల నిర్మాణానికి ప్రజలు ఎదురొంటున్న సమస్యలపై అధికారులతో ఒక కమిటీ వేసి, 15 రోజుల్లోగా నివేదిక తీసుకొని, సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని నిర్ణయం తీసుకుంది.