KCR good news for unemployed..Notification issued for 27 jobs
mictv telugu

నిరుద్యోగులకు కేసీఆర్ శుభవార్త..27 ఉద్యోగాలకు ప్రకటన

August 23, 2022

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్తను చెప్పింది. అటవీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 27 ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్సీ అధికారులు సోమవారం సాయంత్రం నోటిఫికేషన్‌‌ను విడుదల చేశారు. విడుదల చేసిన ఆ నోటిఫికేషన్‌లో..’ములుగు జిల్లాలోని అటవీ కళాశాలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశాం’ అని పేర్కొన్నారు.

టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ మాట్లాడుతూ..”ములుగు జిల్లాలోని అటవీ కళాశాలలో 27 ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ 27 పోస్టుల్లో.. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సెప్టెంబర్ 6 నుంచి 27వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. విద్యాశాఖలో 2,440 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పటివరకు 49,455 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. అందులో భాగంగానే ఈ 27 ఉద్యోగాలకు ప్రకటన వెలువడింది” అని ఆయన అన్నారు.