కేసీఆర్ సర్కార్ మరో నిర్ణయం.. సీనియారిటీ ప్రకారమే - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ సర్కార్ మరో నిర్ణయం.. సీనియారిటీ ప్రకారమే

April 22, 2022

9

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా,హెచ్ఎంలుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల విషయంలో కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త విద్యా సంవత్సరం మొదలయ్యే నాటికి ఉపాధ్యాయుల పదోన్నతులు పూర్తి చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వెబ్ కాన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టి, ప్రమోషన్లు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.

ఇక, బదిలీలు, పదోన్నతుల విషయంలో.. కొత్త జిల్లాల సీనియారిటీ ప్రకారమే హెచ్ఎంల స్థాయి వరకు బదిలీలు, పదోన్నతులు పూర్తి చేయాలని, ఎంఈవో, డిప్యూటీ ఈవో పదోన్నతులను మాత్రం ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం నేతలతో చర్చించి, నిర్ణయం తీసుకోవాలని సబితా ఇంద్రరెడ్డి తెలిపారు. కేసీఆర్ హామీ మేరకు.. 5,571 ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పోస్టులు మంజూరు చేసి, ఎటీలకు ప్రమోషన్లు ఇస్తామని వివరించారు. ఇందుకు సంబంధించిన ఫైల్‌ను సాధారణ పరిపాలన శాఖకు పంపామని, మూడు నాలుగు రోజుల్లో ఉత్తర్వులు వెలువడతాయని విద్యాశాఖ కార్యదర్శి సందీప కుమార్ సుల్తానియా చెప్పారు.