కేసీఆర్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న వారు వేసవి సెలవుల్లోనూ పాఠశాలకు తప్పనిసరిగా రావాలని ఉత్తర్వూలు జారీ చేసింది. పదోవ తరగతి చదువుతున్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఏప్రిల్ 23న ఈ విద్యా సంవత్సరం ముగియనున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 24వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. అయితే, టెన్త్ ప్రీ ఫైనల్ పరీక్షలు మే 6 నుంచి 12 వరకు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 1 వరకు పదో తరగతి విద్యార్థులను ఉపాధ్యాయులు పర్యవేక్షించాల్సి ఉంటుంది.
దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 24 తర్వాత పదో తరగతి విద్యార్థుల కోసం రోజుకు ఒక సబ్జెక్ట్ టీచర్ పాఠశాలకు రావాల్సిందిగా విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా మరో ఐదుగురు లెక్చరర్లకు డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాళ్లుగా పదోన్నతులను కేసీఆర్ ప్రభుత్వం కల్పించింది.