మేడ్చల్ జిల్లాలోని శామీర్ పేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పర్యటించారు. గ్రామస్తులతో సీఎం కేసీఆర్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హరితహారంలో పాల్గొని మొక్కను నాటారు.గ్రామంలో ప్రజలు వాళ్ల ఇండ్లముందు తప్పనిసరిగా నాలుగు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. హరితహారం ఎవ్వల కోసమో గాదు మనకోసం,మనం బ్రతకడంకోసం అని కేసీఆర్ అన్నారు.కేసీఆర్ సారు మొక్కైతే నాటిండు..కానీ దాన్ని కాపాడుకోవాల్సిన బాద్యత మీదే..ఎందుకంటే ఇదివరకే మనం చాలా చూసాం.హరిత హారం కింద ఎన్ని మొక్కలు నాటినా అందులో చాలా వరకు నీళ్లు పోయక ఎండిపోయి కొన్ని,మేకలకు,బర్లకు ఆహారంగా ఇంకొన్ని మొక్కలు బలైపోయాయి.కాబట్టి అవి పెరిగి చెట్లయ్యే వరకు జాగ్రత్తగా కాపాడుకుంటే….ఆతర్వాత చల్లని ప్రకృతి ఒడిలో మీరు హాయిగా సేద తీరచ్చు.