కేసీఆర్‌కు మందుచూపుంది కానీ ముందుచూపు లేదు.. రేవంత్ రెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్‌కు మందుచూపుంది కానీ ముందుచూపు లేదు.. రేవంత్ రెడ్డి

March 30, 2022

ngnfgb

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వరి ధాన్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..”కేసీఆర్‌కు మందుచూపుంది గాని, ముందుచూపు లేదు. రైతులను ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో చర్యలు చేపట్టింది. సంవత్సరాలపాటు ఆలోచించి, రైతుల మేలు కోసం అనేక రైతు చట్టాలు తీసుకొచ్చింది. విదేశీ విహార యాత్రలు ముగించుకుని, వచ్చిన కేటీఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నాడు. కాంగ్రెస్ చరిత్ర గురించి గాని, దేశ చరిత్ర గురించి గాని, తెలంగాణ ప్రజల గురించి గాని రామారావుకి ఎలాంటి అవగాహన లేదు. డ్రామా రావు పుట్టింది ఆంధ్రాలో.. చదివింది విదేశాల్లో ఆయనకు చాలా విషయాలు తెలీయవు” అని రేవంత్ రెడ్డి అన్నారు.

అంతేకాకుండా ’50సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో డ్రామా రావుకి తెల్వదు. రామారావు విదేశీ పర్యటనకు సంబంధించిన విషయాలను దాచిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నాడు. దేశంలో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ.. జలవనరుల ప్రాజెక్టులను, ఎడారి భూములను, బీడు భూములను పచ్చదనం చేసింది. దున్నేవాడిదే భూమి చట్టాన్ని తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే” అని అన్నారు.

మరోపక్క కాసేపటి క్రితమే కేసీఆర్ దంపతులు బేగంపేట నుంచి ఢీల్లీకి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. అనారోగ్య రీత్యా టెస్టులను చేయించుకోని, కుదిరితే ప్రధాని మోదీతో మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో పీసీసీ రేవంత్ రెడ్డి కేసీఆర్ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. వరి ధాన్యం విషయంలో కేసీఆర్, టీఆర్ఎస్ మంత్రులు వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు.