కేసీఆర్‌కు తప్పిన ప్రమాదం.. హెలికాప్టర్‌లో పొగలు - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్‌కు తప్పిన ప్రమాదం.. హెలికాప్టర్‌లో పొగలు

February 27, 2018

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది.  వైర్‌లెస్ సెట్ ఉన్న బ్యాగులో షార్ట్ సర్క్యూట్ వల్ల  ఒక్కసారిగా మంటలు లేచాయి. దీంతో సిబ్బంది వెంటనే అప్రమత్తమై బ్యాగును వందమీటర్ల దూరంలో విసిరేశారు.మంగళవారం కరీంనగర్ నుంచి హెలికాప్టర్ టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసీఆర్ మంగళవారం కరీం నగర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.