కేసీఆర్ అనారోగ్యం ఓ డ్రామా: రేవంత్ రెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ అనారోగ్యం ఓ డ్రామా: రేవంత్ రెడ్డి

March 14, 2022

03

కేసీఆర్ ఆనారోగ్యంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే కేసీఆర్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఎడమ చేయి, ఎడమ కాలిలో నొప్పి రావడంతో.. సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రిలో కరోనరీ యాంజియోగ్రామ్, ఈసీజీ, టూడీ ఈకో, రక్త పరీక్షలు, ఎంఎంఆర్ పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం ఒక వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. డాక్టర్ల సూచన మేరకు కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆరోగ్యంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల నుంచి సానుభూతిని పొందేందుకు ఈ ప్లాన్ వేశారని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో కలిసి నాటకాలకు తెర తీశారని ఎద్దేవా చేశారు. పీకే సూచనలతో కొత్త డ్రామాలు మొదలయ్యాయని దుయ్యబట్టారు. తెలంగాణను ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకునేందుకు ప్రజలంతా కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరారు. మరో 12 నెలలు ఓపిక పడితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అన్నారు.