KCR inaugurated Pratima Cancer Hospital in Warangal
mictv telugu

మమ్మల్ని తిట్టి మాకే అవార్డులిస్తరు.. కేంద్రంపై కేసీఆర్ సెటైర్

October 1, 2022

రాష్ట్ర పనితీరును మెచ్చుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఓ పక్క అవార్డులిచ్చి సత్కరిస్తుంటే.. మరో పక్క కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చి తిట్టి వెళ్తున్నారని సీఎం కేసీఆర్ కేంద్రంపై సెటైర్ వేశారు. శనివారం వరంగల్‌ పర్యటనకు వెళ్లిన ఆయన ప్రతిమ క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ ఆస్పత్రికి అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీలో 150 సీట్లు, ఆస్పత్రిలో 350 పడకలు ఉన్నాయి.

అనంతరం బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. ‘రాజకీయాల కోసం కేంద్రమంత్రులు వచ్చి కేసీఆర్‌ను, మంత్రులను తిట్టి వెళ్తున్నారు. మళ్లీ ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి అవార్డులు ప్రకటిస్తారు. మనల్ని తిట్టడం వాళ్ల రాజకీయంలో భాగం. ఉద్యమ సమయంలో నేనేదైతే చెప్పానో అదే ఇప్పుడు జరుగుతోంది. ఉద్యమ సమయంలో పుట్టిన పిల్లలకు ప్రత్యేక రాష్ట్ర ఫలాలు అందుతున్నాయి. గతంలో తెలంగాణలో మెడికల్ కాలేజీలు ఐదు మాత్రమే ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 17కి చేరింది. కొత్తగా ఏర్పడిన అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలు నిర్మిస్తాం. మెడికల్ సీట్ల సంఖ్య 6,500 ఉండగా, వాటిని పదివేలకు పెంచబోతున్నాం. ఎంబీబీఎస్ కోసం విద్యార్ధులు ఉక్రెయిన్ వంటి దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. 70 వేల టీఎంసీల నీరు, అనుకూల వ్యవసాయ వాతావరణం ఉన్నా విదేశీ ఆహార పదార్ధాలపై ఆధారపడుతున్నాం. పని చేసే యువకులు ఉన్నా వెనుకబడి ఉన్నాం. గొప్ప సహనశీలత కలిగిన దేశంలో విద్వేషాలకు చోటు లేదు. యువత దీనిని గ్రహించి ముందుకు సాగాలి. మేధావులు చైతన్యపరిస్తే సమాజం మరింత పురోగతి సాధిస్తుంది’ అని వ్యాఖ్యానించారు.