పీకే కంటే కేసీఆరే పెద్ద వ్యూహకర్త: కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

పీకే కంటే కేసీఆరే పెద్ద వ్యూహకర్త: కేటీఆర్

April 25, 2022

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతుంది. రోజురోజుకు పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే కేసీఆర్‌తో ఎన్నికల వ్యూహకర్త కర్త ప్రశాంత్ కీశోర్ ప్రగతిభవన్‌లో భేటి అయిన విషయం తెలిసిందే. ఆరోజు నుంచి నేటీవరకు చర్చలు మీద చర్చలు జరుగుతున్నాయి. భేటీలో పీకే కేసీఆర్‌కు ఏం సలహా ఇచ్చాడు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ గెలవడానికి కేసీఆర్ ఏం ఆలోచిస్తున్నాడు? పీకేతో భేటీ కావాల్సిన అవసరం కేసీఆర్‌కు ఎందుకొచ్చింది? అనే పలు అనుమానాలు బీజేపీ, కాంగ్రెస్ నాయకుల్లో ఉత్కంఠను రేపుతున్నాయి.

ఈ నేపథ్యంలో కేటీఆర్ తాజాగా ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీకే గురించి పలు విషయాలను వెల్లడించాడు. ”నేను 8 ఏళ్లు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను. ఆ తర్వాత 8ఏళ్లుగా ప్రభుత్వంలో ఉన్నాను. మంత్రి పదవితో నేను సంతృప్తిగానే ఉన్నాను. నాకు ఎలాంటి ప్రమోషన్లు వద్దు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయినప్పుడు పదేళ్ల వయసున్న బాలుడు మరో రెండు సంవత్సరాల్లో ఓటరు కాబోతున్నాడు.

ఆ బాలుడికి కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా కాకుండా ముఖ్యమంత్రిగా మాత్రమే తెలుసు. జనరేషన్ మారే కొద్దీ కాలానుగుణంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా రాజకీయాల్లో మార్పులు రావాలి. ప్రస్తుతం యువతరం అంతా సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. అక్కడి నుంచి కూడా పార్టీకి బలం చేకూర్చేందుకే ప్రశాంత్ కిషోర్ సాయం తీసుకుంటున్నాం. అంతే తప్ప మాకు లేని శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయని కాదు. ఆ మాటకొస్తే దేశంలో కేసీఆర్‌ని మించిన రాజకీయ వ్యూహకర్త ఎవరూ లేరు’ అని కేటీఆర్ అన్నారు.