కేసీఆర్‌కు ఇవాంకా లేఖ - MicTv.in - Telugu News
mictv telugu

 కేసీఆర్‌కు ఇవాంకా లేఖ

December 18, 2017

ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ఇటీవల హైదరాబాద్‌లో అట్టహాసంగా జరగడం తెలిసిందే. దీనికి విచ్చేసిన అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంకా ట్రంప్.. నగరంపై ప్రశంసలు గుప్పించడమూ విదితమే. ఆమె ఇప్పుడు కూడా భాగ్యనగరాన్ని తలచుకూనే ఉంటున్నారు.

తనకు అద్భుత ఆతిథ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె కేసీఆర్‌కు లేఖ రాశారు. తెలంగాణ సర్కారు తనకు  ఆహ్వానం పలికన తీరు  స్పూర్తిదాయకంగా, అనిర్వచీయంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన ఆతిథ్యానికి ధన్యవాదాలు అని అన్నారు. ఇకముందు కూడా అవకాశం దొరికితే మళ్లీ హైదరాబాద్‌కు వస్తానని పేర్కొన్నారు. ఫలక్‌నుమ ప్యాలస్‌లో తనకు అందించిన కానుక గొప్ప అనుభూతిని కలిగించిందని అన్నారు.