యశోదా ఆస్పత్రిలో చేరిన కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

యశోదా ఆస్పత్రిలో చేరిన కేసీఆర్

January 21, 2020

Kcr

తెలంగాణ ముఖ్యమంత్రి మంగళవారం అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు. ఆయన జలుబు, దగ్గు, జ్వరంలో బాధపడుతున్నారని,  వైద్యులు అన్ని పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారని సన్నిహితులు తెలిపారు. స్వల్ప అనారోగ్యం మాత్రమేనని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. స్వల్ప అస్వస్థతకు సీఎం కుటుంబ సభ్యులు యశోదా ఆస్పత్రి వెళ్లడం సాధారణమే.