కేసీఆర్ కీలక ప్రకటన.. 91,142 ఉద్యోగాలు భర్తీ - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ కీలక ప్రకటన.. 91,142 ఉద్యోగాలు భర్తీ

March 9, 2022

ngnfg

తెలంగాణ వ్యాప్తంగా నేడు 33 జిల్లాల నిరుద్యోగులందరు టీవీలకే పరిమితమయ్యారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఎప్పుడెప్పుడు ఉద్యోగాల ప్రస్తావన చేస్తారు.? ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు.? ఏఏ శాఖల ఉద్యోగాలు ప్రకటిస్తారు.? ఉద్యోగాల ప్రకటన చేశాక, అర్హతలు ఏంటీ? వయోపరిమితి ఎంత? ఎప్పుడు దరఖాస్తు ప్రారంభమౌతుంది? అనే ఉత్కంఠ నిరుద్యోగుల్లో మొదలైంది. అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగం చెప్పినట్టుగానే 10 గంటలకు ప్రారంభమైంది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ..”తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థులు ఉద్యమం చేశారు. ఉద్యోగాలు రాలేదన్న బాధతో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తెలంగాణ ఏర్పాటు చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టం. తెలంగాణ తొలిదశలో ఉద్యమంలో నేనూ కూడా లాఠీదెబ్బలు తిన్నా, వివక్ష, అన్యాయంతో తెలంగాణ నలిగిపోయింది. తెలంగాణలో వేరే పార్టీలకు రాజకీయాలంటే ఓ గేమ్.. కానీ టీఆర్ఎస్ పార్టీకి రాజకీయాలంటే ఓ టాస్క్. ఈరోజు తెలుగు సినిమాల్లో తెలంగాణ భాష పెడితేనే సినిమా హీరో క్లిక్ అవుతుంది. ఒకప్పుడు తెలంగాణ భాషను జోకర్‌లా పెట్టేవారు” అని సీఎం కేసీఆర్ అన్నారు.

తెలంగాణలో మొత్తం 91,142 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌ట‌న చేశారు. అసెంబ్లీలో తెలంగాణ‌ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఉద్యోగాలపై స్పందించారు. 91,142 ఉద్యోగాల భర్తీకి నేడే నోటిఫికేష‌న్ ఇస్తున్న‌ట్లు చెప్పారు. నేడు ఆయా శాఖ‌లు నోటిఫికేష‌న్లు జారీ చేస్తాయ‌ని వివ‌రించారు. ఇందులో విద్యా శాఖ‌లోనే దాదాపు 25,000-30,000 మ‌ధ్య ఉద్యోగాలు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

రాష్ట్రంలో 11,103 మంది ఒప్పంద ఉద్యోగులు ఉన్నార‌ని తెలిపారు. వారంద‌రినీ క్ర‌మ‌బ‌ద్ధీక‌రిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అటెండ‌ర్ నుంచి ఆర్డీవో వ‌ర‌కు స్థానికుల‌కు 95 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను ప్ర‌క‌టించారు. నియామ‌కాల్లో 95 శాతం రిజ‌ర్వేష‌న్లు సాధించిన ఏకైక రాష్ట్ర తెలంగాణ అని చెప్పారు.

రాష్ట్రంలో ఇప్ప‌టికే తాము 1.56 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చామని, 1.12 లక్షల కొత్త పోస్టులు మంజూరు చేశామ‌ని చెప్పుకొచ్చారు. తెలంగాణ‌లో 1,33,940 ఉద్యోగాలు భర్తీ అయ్యాయని చెప్పారు.

మిగిలిన‌ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నడుస్తోందని అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం నుంచి హక్కులు శాశ్వత ప్రాతిపదికన పరిష్కారానికి కృషి చేస్తున్నామ‌ని తెలిపారు. 95 శాతం లోకల్‌ కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించామ‌ని అన్నారు. కేంద్ర స‌ర్కారు సమస్యలను పరిష్కరించడం లేదని అన్నారు. దేశంలోనే అతి త‌క్కువ అప్పులు ఉన్న రాష్ట్రం తెలంగాణ అని ఆయ‌న చెప్పుకొచ్చారు. తాము క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ప‌రిపాల‌న కొన‌సాగిస్తున్నామ‌ని చెప్పారు