మా నాన్న క్షేమం.. కేటీఆర్ ట్వీట్ - MicTv.in - Telugu News
mictv telugu

మా నాన్న క్షేమం.. కేటీఆర్ ట్వీట్

February 27, 2018

ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్‌లోని బ్యాగు నుంచి పొగ రావడంతో తీవ్ర కలకలం రేగింది. సిబ్బంది వెంటనే ఆ బ్యాగును గుర్తించి దూరంగా పడేశారు. కేసీఆర్‌కు ఏమైనా ప్రమాదం జరిగిందా అని అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై ఒక అభిమాని ట్విటర్లో మంత్రి కేటీఆర్‌ను అడిగారు. కేసీఆర్ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారని ఓ వెబ్ సైట్‌లో చూశానని, ఏం జరిగిందో తెలపాలని కోరారు.దీనికి కేటీఆర్ స్పందిస్తూ.. తాను ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సంప్రదించానని, కేసీఆర్ క్షేమంగానే ఉన్నారని తెలిపారు. ఆయన ప్రస్తుతం అదిలాబాద్‌లో పర్యటిస్తున్నారని వెల్లడించారు. మరోపక్క.. దీనిపై డీజీపీ మహేందర్ రెడ్డి కూడా స్పందించారు.  హెలికాప్టర్లో షార్ట్ సర్య్యూట్ వల్ల బ్యాగులోంచి మంటలు వచ్చాయని, సిబ్బంది ఆ బ్యాగును సిబ్బంది దూరంగా పడేశారని తెలిపారు.