KCR left with 4 thousand cars..in an area of ​​40 acres
mictv telugu

4 వేల కార్లతో బయల్దేరిన కేసీఆర్..40 ఎకరాల విస్తీర్ణంలో

August 20, 2022

తెలంగాణలోని నల్గొండ జిల్లా మునుగోడు మండలంలో నేడు జరగబోయే ప్రజా దీవెన బహిరంగ సభకు టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్..హైదరాబాద్ నుంచి 4 వేల కార్లతో బయలుదేరారు. టీఆర్‌ఎస్ పార్టీ నుంచి పోటీచేసే అభ్యర్థిగా కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఈ వేదిక నుంచే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బహిరంగ సభలో పాల్గొనడానికి ముందు కేసీఆర్..నియోజకవర్గ స్థానిక నేతలతో కేసీఆర్ సమావేశమై, ఉప ఎన్నిక వస్తే అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్ధేశం చేయనున్నారు.

ఇక, ప్రజా దీవెన సభ విషయానికొస్తే..మునుగోడు ఎంపీడీవో కార్యాలయ శివారులో 40 ఎకరాల విస్తీర్ణంలో ఈ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభ ఏర్పాట్లను మంత్రి జగదీశ్ రెడ్డి చూసుకుంటున్నారు. సభకు రెండు గంటల ముందే కేసీఆర్ మునుగోడు చేరుకోనున్నారు. ఈరోజు సభా వేదికగా కేసీఆర్ ఏం మాట్లాడుతారు? మునుగోడు ప్రజలకు ఏ హామీలు ఇస్తారు? అనే తదితర అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మరోపక్క రేపు మునుగోడులో జరగబోయే బీజేపీ బహిరంగ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మునుగోడు చుట్టుపక్కల ఎక్కడ చూసినా టీఆర్ఎస్, బీజేపీ పార్టీల జెండాల రెపరెలలాడుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు ఈరోజు,రేపు ఎక్కడ ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పహారా కాస్తున్నారు. ఆదివారం సభలో బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయాలు తీసుకుంది? ఏ హామీలు ఇవ్వనుంది? అనే అంశాలపై కూడా ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.