మోదీకి కేసీఆర్ లేఖ.. ఆ బిల్లుపై అసంతృప్తి - MicTv.in - Telugu News
mictv telugu

మోదీకి కేసీఆర్ లేఖ.. ఆ బిల్లుపై అసంతృప్తి

June 2, 2020

kjhgv

విద్యుత్ చట్టానికి సవరణలు తెస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లు-2020పై రాష్ట్రాలు అభిప్రాయాలను తెలుపాలంటూ కేంద్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో ప్రధానికి లేఖ రాశారు. సదరు బిల్లుపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం ప్రతిపాదించిన బిల్లు రాష్ట్ర విద్యుత్ సంస్థల నిర్వహణపై ప్రత్యక్షంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని లేఖలో పేర్కొన్నారు. విద్యుత్ సవరణ బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ విద్యుత్ సవరణ బిల్లు రాష్ట్రాలు తమకున్న అధికారాలు కోల్పోయేలా ఉందని కేసీఆర్‌ విమర్శించారు. జాతీయ పునరుత్పాదక శక్తి పాలసీలో మార్పులు చేసే ముందు రాష్ట్రాలను సంప్రదిచాల్సిన అసవరం ఉందని స్పష్టంచేశారు. దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు ఉంటాయని, వాటికి అనుగుణంగా మార్పులు చేసుకునే అవకాశం రాష్ట్రాలకు ఉండాలన్నారు. ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లుతో ప్రస్తుతం సబ్సిడీ పొందుతున్న రైతులు, గృహ వినియోగదారులకు నష్టం జరుగుతుందని తెలిపారు.