కోల్‌కతాకు కేసీఆర్.. థర్డ్ ఫ్రంట్ వేగం - MicTv.in - Telugu News
mictv telugu

కోల్‌కతాకు కేసీఆర్.. థర్డ్ ఫ్రంట్ వేగం

March 17, 2018

దేశ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన కేసీఆర్ వేగం పెంచారు. ఆయన సోమవారం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా వెళ్లనున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో చర్చలు జరుపుతారు. కొత్త ఫ్రంట్ నిర్మాణం, లక్ష్యాలు, కలసి వచ్చే శక్తులెవరు తదితరాలపై చర్చిస్తారు.

కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ప్రకట చేసిన వెంటనే మమత ఆయనకు ఫోన్ చేసి అభినందించారు. తర్వాత జేఎంఎం వంటి చిన్నాచితకా పార్టీలు కూడా బాసటగా నిలిచాయి. అయితే జేఎంఎం కాంగ్రెస్ వైపు ముగ్గుచూపుతోంది. కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ ఇటీవల ఇచ్చిన విందుకు తృణమూల్, సమాజ్ వాదీ పార్టీ తదితర పక్షాలు హాజరయ్యాయి. మరోపక్క.. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో చంద్రబాబు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తారని వార్తలు వస్తున్నాయి. కేంద్రంలోని మోద సర్కారుపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మమత మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కోల్‌కతా బాట పడుతున్నారు.