థర్డ్ ఫ్రంట్‌కు అందరూ నాయకులే.. కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

థర్డ్ ఫ్రంట్‌కు అందరూ నాయకులే.. కేసీఆర్

March 19, 2018

దేశంలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటవుతున్న థర్డ్ ఫ్రంట్ రాజకీయాల కోసం కాదని, దేశ ప్రజల కోసమని టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ దేశ ప్రజలు ప్రత్యామ్నాయ శక్తి కోసం ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీలు పాలనలో, ప్రజల అవసరాలు తీర్చడంతో ఘోరంగా విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. థర్డ్ ఫ్రంట్ కూర్పు కోసం సోమవారం పశ్చిమ బెంగాల్ వెళ్లిన ఆయన కోల్‌కతాలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో చర్చలు రెండుగంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. మూడో కూటమి నిర్మాణం, కలసి వచ్చే పార్టీలు, సాధించాల్సిన లక్ష్యాలు వంటివాటిపై అభిప్రాయాలను కలబోసుకున్నారు. అనంతరం కేసీఆర్ విలేకర్లతో ముచ్చటించారు.‘ఇది బీజేపీకో మరో పార్టీకో సంబంధించిన సమస్య కాదు, ప్రజల సమస్య. కాంగ్రెస్, బీజేపీలు ఈ దేశ ప్రజల అవసరాలు తీర్చలేకపోయాయి. అయినా అయితే బీజేపీ, లేకపోతే కాంగ్రెస్ అనే పరిస్థితి నెలకొంది. అవి తప్ప దేశాన్ని పాలించేవారెవరూ లేరా? ఇకనైనా గుణాత్మక మార్పు దిశగా శుభారంభం జరిగింది..’ అని చెప్పారు. థర్డ్ ఫ్రంట్ కు ఎవరు నాయకత్వం వహిసస్తారని అడగ్గా.. అందరూ ఉమ్మడిగా నాయకత్వం వహిస్తారు అని బదులిచ్చారు.కాగా కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు పార్టీలు ఏకం కావాల్సి ఉంటుందని మమత అన్నారు. కేసీఆర్ తోపాటు ఆయన కుమార్తె, ఎంపీ కవిత, టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేశవరావులు కూడా మమతను కలుసుకున్నారు.