కేసీఆర్‌పై పోలీస్ స్టేషన్‌లో బీజేపీ ఫిర్యాదు - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్‌పై పోలీస్ స్టేషన్‌లో బీజేపీ ఫిర్యాదు

March 8, 2018

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధాని నరేంద్ర మోదీని ఏకవచనంతో సంబోధించి కించపరచారని మొఘల్ పురా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ప్రధాని గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడిన సీఎంపై చర్యలు తీసుకోవాలని  తెలంగాణ బీజేపీ మైనారిటీ మోర్చా ఉపాధ్యక్షుడు, న్యాయవాది ఎంఏ అబ్బాసీ పోలీసులను కోరారు. కేసీఆర్ వ్యాఖ్యలతో మోదీ అభిమనుల మనోభావాలు దెబ్బతిన్నాయని వాపోయారు. దేశ అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తిని అలా దూషించడం సీఎం స్థాయికి తగదని, కేసీఆర్ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.