రాజకీయాల్లో కేసీఆర్‌ని మించిన బుర్రలేదు.వేసే ఎత్తులు..చేసే వ్యూహాలు ఎవరికీ అర్థం కావు.ఒకవేళ అర్థమైనా కానట్టే ఉంటాయి.ప్రత్యర్థుల్ని ఎంచుకుని మరీ ఢీ కొడతారు.ఎవరు రేసులో ఉండాలో ఆయన డిసైడ్ చేస్తారు. స్కెచ్ వేస్తే పక్కా అమలు కావాల్సిందే. ప్రత్యర్థిని జాకీలు పెట్టి పైకిలేపి పోరాటంలోకి దింపుతారు. రాబోయే ఎన్నికల కోసం ఖతర్నాక్ స్ట్రాటజీ అమలు చెయబోతున్నారట.
కేసీఆర్ నయా స్ట్రాటజీ
రేసులో ఉండాలి. ఆ పార్టీయే ఉండాలి.వాళ్లని దాటుకుని దరిదాపుల్లోకి ఇంకొకరు రాకూడదు.రేసుకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్నోడ్ని దగ్గరకు పిలిచి నువ్వే నా ప్రత్యర్థి అంటారు. ఢీ కొడితే నువ్వు నన్ను ఢీకొట్టాలి.నిన్ను మించినోడు తెలంగాణలో లేడు అంటారు..ఇవన్నీ తెలంగాణ బీజేపీని ఉద్దేశించి కేసీఆర్ అనే మాటల్లో లోతైన అర్థం. ఎప్పటికప్పుడు బీజేపీని రేసులో ఉంచాలి. రేసులో ఉండాలంటే ఆ పార్టీని రెచ్చగొట్టి వదిలేయాలి.తెలంగాణలో తరచుగా కేసీఆర్ చేస్తున్నది ఇదే.నిజానికి తెలంగాణలో మొదట్లో బీజేపీకి అంతా సీన్ లేదు. టీఆర్ఎస్ , కాంగ్రెస్ తర్వాతే బీజేపీ ఉండేది.మూడు,నాలుగు నియోజకవర్గాల్లో తప్ప అన్ని చోట్ల ఇదే పరిస్థితి.రాను రాను బీజేపీ జోరు పెంచుతూ వస్తోంది. లేదు లేదు కేసీఆర్ పరోక్షంగా పెంచేలా కారణమయ్యారు.
నగరంలో మొదలైంది….
నగరంలో కాంగ్రెస్‌కు ఒకప్పుడు మంచి పట్టు ఉండేది. 2014,2018 ఎన్నికల్లో ఆ పార్టీ చెప్పుకోదగ్గ ఎమ్మెల్సేల్ని గెలుచుకుంది. ఆ తర్వాత వాళ్లంతా టీఆర్ఎస్లోకి వెళ్లారు. అయినా నగరంలో కాంగ్రెస్‌కు కేడర్ , ఓటు బ్యాంక్ ఉంది. దీన్ని ఎలాగైనా బ్రేక్ చేయాలనుకున్నారు కేసీఆర్. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీని రెచ్చగొట్టి వదిలేశారు. అంతే స్పీడ్ పెంచి బండి 40 స్థానాలకు పైగా ఎగురేసుకుపోయారు. ఇక్కడ కేసీఆర్ టార్గెట్ సక్సెస్ అయింది. హైదరాబాద్‌లో కాంగ్రెస్ కనుమరుగైంది. ఆ తర్వాత ఉప ఎన్నికల్లోనూ ఇదే స్ట్రాటజీ మెయింటైన్ చేశారు. హుజూరాబాద్‌లో సీన్లో లేకుండా చేశారు. మునుగోడు సిట్టింగ్ స్థానంలో మూడోస్థానికి పరిమితం చేశారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో…
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కేసీఆర్ ఇదే స్ట్రాటజీని అమలు చేయబుతున్నారట. ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో కేడర్ లేని బీజేపీని ఈజీగా ఢీ కొట్టొచ్చు.ఈ స్ట్రాటజీ వెనుక కేసీఆర్‌కు బలమైన కారణం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్‌కు కేడర్ ఉంది. చాలా నియోజకవర్గాల్లో బలంగా ఉంది. కొన్నింటిలో ద్వితీయ స్థానంలో ఉందట. కేసీఆర్ స్వయంగా చేసిన సర్వేలో ఇదే తేలిందట. అందుకే కాంగ్రెస్‌ను సీన్లో లేకుండా చేస్తున్నారట. బీజేపీ అనే బంతిని ఎంత విసరికొడితే అంత ఎత్తుకు లేస్తుంది. ఆట మహారంజుగా సాగుతుంది. జనం దృష్టి అంతా టీఆర్ఎస్ ,బీజేపీపైనే ఉంటుంది. కాంగ్రెస్ వారి కంటికి కనిపించదు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు.అంతిమంగా సీఎం కేసీఆర్‌కు కావాల్సింది ఇదే.
బీజేపీలో లేని చోట షర్మిల
తెలంగాణలో బీజేపీ కొన్ని చోట్ల చాలా బలహీనంగా ఉంది. వరంగల్ , ఖమ్మం ,ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో ఆ పార్టీకి కొన్ని నియోజకవర్గాల్లో కేడర్ లేదు. కేడర్ ఉన్నా నడిపించే నాయకుడు లేరు. ఇలాంటి సెగ్మెంట్లలోనే షర్మిలను రాజకీయంగా కేసీఆర్ వాడేస్తున్నారు. మొన్న నర్సంపేటలో జరిగింది ఇదే.ఖమ్మం జిల్లాలోనూ షర్మిలను రాజకీయంగా వాడేయబోతున్నారుట.భవిష్యత్‌లో అక్కడక్కడ బీజేపీలా షర్మిలను సీన్ తేస్తారని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా రెండు విధలా లాభం పొందేలా కేసీఆర్ నయాస్ట్రాటజీ ఉండబోతోందన్నమాట.