పౌరసత్వ చట్టంపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..  - MicTv.in - Telugu News
mictv telugu

పౌరసత్వ చట్టంపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు.. 

January 25, 2020

Kcr on citizenship amendment act 

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు ఉండాలని, ఆ స్ఫూర్తికి భంగం కలిగిస్తున్న సీఏఏ చట్టాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. దీనికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదిస్తామని ప్రకటించారు. మునిసిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడంతో ఆయన విలేకర్లతో పలు అంశాలపై మాట్లాడారు. 

‘సీఏఏ చట్టానికి మద్దతిచ్చే ప్రసక్తే లేదని అమిత్ షాకు ఫోన్లోనే తెగేసి చెప్పారు. అసలు సీఏఏ అనేదే పెద్ద తప్పుడు నిర్ణయం. దేశానికి మచ్చ. దీనిపై మౌనంగా ఉండడం సాధ్యం కాదు. ఉద్దేశపూర్వకంగా ఒక వర్గాన్ని పెట్టడం ఎవరికీ మంచింది కాదు. ఈ రోజు వారిని పక్కనబెడతారు. రేపు సిక్కులను పెడతారు. అందుకే దీనిపై ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహిస్తాం. టీఆర్ఎస్ లౌకిక పార్టీ.. ఈ దేశం ప్రజలది,  ఏ మతానిదీ కాదు. రాజ్యాంగం అందరికీ సమానమే..’ అని అన్నారు. తాము కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370కి మద్దతిచ్చిన మాట వాస్తవమేనని, అయితే సీఏఏను మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తామని.