KCR ordered to distribute 30 percent share to Singareni workers
mictv telugu

సింగరేణి కార్మికులకు కేసీఆర్ దసరా కానుక.. ఉత్తర్వులు జారీ

September 28, 2022

సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ దసరా పండుగ కానుకను ప్రకటించారు. సింగరేణి సంస్థ లాభాల్లో 30 శాతం వాటాను కార్మికులకు పంచాలని నిర్ణయించారు. అంతేకాక, దసరాలోపు ఆ మొత్తాన్ని కార్మికులకు అందజేయాలని ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కేసీఆర్ ఆదేశాలతో సీఎంవో ముఖ్య కార్యదర్శి సింగరేణి సంస్థకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. 30 శాతం వాటా అంటే దాదాపు రూ. 368 కోట్లు. అయితే దసరా కానుకగా లాభాల్లో వాటాను పంచడం కొత్త కాదు కానీ, ప్రతీ ఏడాది కేసీఆర్ ఒక శాతాన్ని పెంచుకుంటూ వస్తున్నారు. 2020లో 28 శాతం వాటా పంచగా, 2021లో 29 శాతాన్ని ఇచ్చారు. ఇప్పుడు మరో శాతం పెంచి మొత్తం 30 శాతానికి చేర్చారు. దీంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబంతో పండుగను సరదాగా, సంతోషంగా జరుపుకుంటామని, కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.