దేవుడితో సైతం కొట్లాడతా.. కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

దేవుడితో సైతం కొట్లాడతా.. కేసీఆర్

October 1, 2020

Kcr pledges to fight with god in interests of telangana farmers ..

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నీటితో ముడిపడి నడిచిందని సీఎం కేసీఆర్ అన్నారు. పంటల దిగుబడిలో రాష్ట్ర రైతు దేశానికే ఆదర్శంగా నిలిచాడని, రాష్ట్రం అన్నపూర్ణగా మారిందని కొనియాడారు. అంతర్రాష్ట్ర జలవివాదాలపై ఈ నెల 6 జరిగే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో చర్చించే బోయే అంశాలపై ఆయన ఈ రోజు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో  భేటీ అయ్యారు. 

‘వ్యవసాయ రంగం, రైతుల రక్షణ కోసం దేవుడితోనైనా కొట్లాటకు నేను సిద్ధం. తెలంగాణ ఉద్యమం నీటితో ముడిపడే సాగింది. మేం సాగునీటి రంగాన్ని పటిష్టం చేస్తున్నాం. బీళ్లను పచ్చగా మారుస్తున్నాం. రాష్ట్రంలో పండగవాతావరణం నెలకొంది. మన హక్కు ప్రకారం గోదావరి, కృష్ణా గోదారవి నీటో ప్రతి చుక్కను వాడుకుంటాం.. ’ అని సీఎం స్పష్టం చేశారు. అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో తెలంగాణ తరఫున బలంగా వాదించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఏపీ ప్రభుత్వం కావాలనే వివాదం పెట్టుకుందని మండిపడ్డారు.