కేసీఆర్ ప్రెస్ మీట్ హైలెట్స్ ...! - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ ప్రెస్ మీట్ హైలెట్స్ …!

August 2, 2017

తెలంగాణాలో పుట్టగతులుండవనే భయంతోనే  కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందే తప్ప తెలంగాణ ప్రజలమీదున్న ప్రేమతో కాదు.

గతంలో రాష్ట్రాన్ని కాంగ్రెస్ వాళ్లు కుక్కలు నక్కలు పీక్కుదిన్నట్టు తిన్నరు.

కాంగ్రెస్ మూడేళ్లనుంచి ఓకటే సొల్లు ఓకటే పురానాలు పెడుతున్నారు.

పిడుగుకు ,సావుకు ,పెండ్లికి ఒకే మంత్రం అన్నట్టు చేస్తున్నరు.

ఆంధ్ర నాయకుల అడుగులకు మడుగులొత్తి,చేతగానితనంగా ఉంది మీరు కాదా.

కాంగ్రెస్ వాళ్లు ఉన్మాదులుగా వ్యవహరిస్తున్రు.

మీకు న్యాయస్ధానం ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా బుద్ది అస్తలేదు.

మేం ఏం జెయ్యలేదు..మీరు గుడ ఏం జెయ్యకున్రి అన్నట్టు జేస్తున్నరు కాంగ్రెస్ వాళ్లు.

సర్కార్ ఏదన్న నిర్ణయం తీస్కునుడు ఆల్శం..సర్రున ఉర్కుతున్రు స్టే కోసం.

చివరికి అమరవీరుల స్మారకంకు కూడా స్టే ఏశిన్రు.

ప్రవర్తన మార్చుకోరా..కాంగ్రెస్ కు ఇంత అసహనం ఎందుకు?

శాసనసభ చనిపోయిన స్ధానల నుంచి కూడా గెల్వలేరు…అడ్డం పొడువు మాట్లాడితే ఐతదా.

విషయం ఏదైనా రోజులెన్నైనా మేం చర్చకు సిద్దం మీకు మాట్లాడే దమ్ముందా

భర్త చనిపోయిన ఆడవాళ్లకు పెన్షన్ ఇస్తే కాంగ్రెస్ వాళ్లు దాన్ని సిన్మ అన్నరు…మీ బతుకే సిన్మ ఐపోయింది.ఇంకెందుకు ఈ సిన్మలు.

సెక్రేటరేట్ కడదామంటే స్టే,బైసన్ పోలో గ్రౌండ్ తీసుకుందామంటే స్టే

సింగరేణి కార్మికుల నోర్లు కొట్టింది కాంగ్రెస్.

పబ్బులు గబ్బులు తెచ్చింది మేమా..మీరు గాదా?

మీరాకుమారి అయితే ఓరా కుమారి  అయితేంది..ఆమెకు ఓట్లేస్తే  బంగారం లేకపోతే  బొగ్గు.

మీబతుకుకు ఓడాక్యుమెంటో ఆదారమో ఉన్నాయో..ఉత్తగ సన్నాసి రాజకీయం జేస్తున్రు.

ఆ జైరాం రమేశ్ కనీసం  సర్పంచ్ గెల్శిండా,నిజాలు నిరూపించకపోతే  ముక్కునాలకు రాస్తడా.

మీరు జేసిన దొంగతనం మేము జేస్తమా.

డబ్బా రవీంద్రబారతిని పట్టుకొని ఎన్నిరోజులుంటం. అదే వైకుంఠమా? మంచి కళా క్షేత్రం కట్టుకోవద్దా?

గచ్చిబౌలి, ఇండోర్ స్టేడియంల ఆటలు లెవ్వు కేవలం పెండ్లిల్లు అయితున్నయ్.

నిజాం లక్షల ఎకరాలు ఇచ్చిపోయిన్రు…తెలంగాణ ఏమన్న బికారిదా?

ఏ పనులనైనా కేసీఆర్ మార్కు, టిఆర్ ఎస్ మార్కు ఉందద్దు అంతేగా

సమాన పనికిసమనా వేతనమే మా పాలసీ.

ముండమోపి పనులు జేశ్నా…వెకిలి ప్రయత్నాలు ఎన్ని చేసినా తెలంగాణను అభ్యుదయ పథాన్ని మార్చలేరు ఉక్కుసంకల్పం తోని ముందుకు పోతున్నం…