కాంగ్రెస్ చరిత్రను చదివిన కేసీఆర్..! కాలగర్భంలోకి కాంగ్రెస్ అంటున్న గులాబీ బాస్..! - MicTv.in - Telugu News
mictv telugu

కాంగ్రెస్ చరిత్రను చదివిన కేసీఆర్..! కాలగర్భంలోకి కాంగ్రెస్ అంటున్న గులాబీ బాస్..!

August 2, 2017

భారత దేశంలో ఎక్కడా లేనట్టు మన తెలంగాణ లో వింత పరిస్థితి కనిపిస్తుంది.తెలంగాణ వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్లు అధికారం మాకే వస్తది అని చివరకు భంగపడ్డారు. ప్రజల్లో వాళ్లకు కనీస మద్దతు కూడా రాలేదు.అసెంబ్లీలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మీ తెలంగాణకు ఒక్కరూపాయి కూడా ఇవ్వను ఎం చేసుకుంటారో చేస్కో పో అన్నప్పుడు ఒక్క ఎమ్మెల్యే కూడా లేచి అడగలేదు ఎందుకు?.నీటి ప్రాజెక్ట్స్ పైన 160 కేస్ లు వేస్తారా? ఏ రాష్ట్రంలో నైన వేస్తారా  ఇట్ల…ఇప్పటి వరకు 196 కేస్ లు వేశారు.కాంగ్రెస్ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నరో అర్ధం అవుతుంది.పనికి మాలిన రాజకీయ లబ్ది కోసం కేస్ లు వేస్తున్నారు.ఒక్కటే కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఒక్కరోజే 6 కేస్ లు వేశారు. అయిన అన్ని కొట్టివేశారు. కొన్ని సందర్భలలో వాళ్ళను న్యాయమూర్తులు మొట్టి కాయలు వేశారు.నీచాతీ నీచమైన రాజకీయాలకు దిగుతున్నారు కాంగ్రెస్ వాళ్లు.కాంటాక్ట్ వ్యవస్థ ను పుణ్యాత్ముడు చంద్రబాబు ప్రవేశ పెట్టుండు. దాన్ని రాజశేఖర్ రెడ్డి కొనసాగించాడు. విద్యుత్ ఉద్యోగుల విషయం లో కూడా వాళ్ళను అబిజార్షన్ చేశాం కానీ వాళ్ళను రెగులర్ చెయ్యలేదు. దీన్ని ఎదో అర్ధం చేసుకొని కోర్ట్ ల చుట్టూ తిరుగుతున్నారు. దయచేసి కోర్ట్ వాళ్ళు అర్ధం చేసుకోవాలి.కోర్ట్ వాళ్ళు అవలంభిచిన తీరు అభినందనీయం కోర్ట్ వాళ్లు నిర్ణయించిన దానికంటే ఒక్క వెయ్యి అదనంగా ఇస్తున్నాం.

కోర్ట్ వాళ్ళు దళారి వ్యవస్థ నిర్ములిచేందుకు దళారులు వేసిన పిటిషన్ ను కొట్టివేయడం వల్ల కార్మికులకు రక్షణ వచ్చింది.గతంలో గాంధీ భవన్ ను కాంటాక్ట్ లెచ్చరర్ లు ముట్టడి  చేశారు. త్వరలో హోమ్ గర్డ్స్ ను పిలుచుకుని వాళ్లకు కూడా న్యాయం చేస్తాం.కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు ను ప్రజలు కూడా గమనించాలి. వాళ్ళ దుర్మార్గం తీరు ను అందరు గమనించాలి.కాళేశ్వరం కి నీళ్లు వస్తున్నాయి అంటే కాంగ్రేస్ వాళ్ల గుండెలు ఆగిపోతున్నాయి.4400 ఎకరాలు కావాలి కొండపోచమ్మ ప్రాజెక్ట్స్ కి ఇప్పటికే 4200 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ అయింది . ఆ 200 ఎకరాలు ఎవ్వరి అంటే కాంగ్రెస్ వాళ్ల వే. 200 ఎకరాల భూమికి ప్రాజెక్ట్స్ అపుతారా…ఇదేనా మీ నీచ రాజకీయం .. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారు.

చీకట్లో ఉన్న తెలంగాణ ను వెలుగులు నింపుదాం అని యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్స్ నిర్మిస్తే కూడా కేస్ లు వేసి ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత దుర్మార్గంగా నేషనల్ పార్టీ వ్యవహరిస్తదా….. ఇదేనా మీ పార్టీ …తెలంగాణ కు ముల్కి రూల్స్ ఉండాలి అని కోర్ట్ చూచిస్తే ఆ రూల్స్ రద్దు చేసి తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టిన పార్టీ కాంగ్రేస్ పార్టీది.

2004 లో తెలంగాణ లో మా పార్టీ తో పొత్తు పెట్టుకొని  అధికారంలోకి వచ్చి తెలంగాణ ఇవ్వలేదు. సచ్చే ముందే సావు తప్పదు అని  2014లో తెలంగాణ ను ఇచ్చింది. అందుకే తెలంగాణ ప్రజలు వాళ్ళను తిరస్కరించారు.మాట్లాడనికి కొంచం సిగ్గు ఉండాలి. అచంపేట్ లో అల్ పార్టీ అని ఎన్నికలకు పోతే ఒక్క సిటు కూడా రాలేదు. లాస్ట్ కు పాలేరు లో కూడా అన్ని పక్షాలు ఒక్కటైన మా అభ్యర్థి తుమ్మల గెలిచాడు..మాట్లాడడానికి సిగ్గు ఉండాలి గతంలో ఇసుక మీద 10 కోట్ల ఆదాయం వస్తే తెలంగాణ వచ్చిన కొద్దీ రోజులకే అధిక ఆదాయం వచ్చింది. నీళ్లతో ప్రాజెక్ట్స్ కలకలడుతుంటే వాళ్ళ గుండెలు ఆగిపోతున్నాయి.ఏవ్వరు ఎన్ని ప్రయత్నాలు చేసిన ఎన్ని అడ్డంకులు ఎదురైన తెలంగాణ అభివృద్ధి ని ముందుకు తీసుకొని ముందుకు పోతాం.మా ఏకాగ్రత అంత తెలంగాణ అభ్యుదయ పతంలో నడిపే ప్రగతిని ఆపలేరు.

చివరికి అమరవీరుల స్థూపం మీద కూడా కేస్ వేశారు.అన్నింటి లో పిల్ లు వేస్తూ పిల్ కాంగ్రెస్ గా వ్యవహరిస్తోంది. ఇంత దుర్మార్గంగా దేశంలో ఎక్కడ లేదు.విద్యుత్ లో అనేక అనూహ్యమైన ప్రగతి ని సాధించాం.24 గంటల కరెంట్ వద్దు అని అంటున్నారు రైతులు గతంలో కరెంట్ కావాలి అని ధర్నాలు చేశారు.ఈరోజు  విద్యుత్ వినియోగం 9326 మెగా వాట్స్ .. ఎంత డిమాండ్ పెరిగిన ఎక్కడ కూడా అంతరాయం లేకుండా ఇస్తున్నారు.

సభను కూడా నడపడనికి మేము రెడీ గా ఉంటే మీరు సహకరించరు…శాసనసభ ను నిబందలకు అనుగుణంగా నడిపిస్తాం ఎవరైనా అరిస్తే మెడలు పట్టి బయటకు పంపుతాం…డ్రగ్స్ సంబంధించిన విషయం ను మొగ్గ దశలో తెంచాలి. అని కాబినెట్ మంత్రి ఉన్న వదలవద్దు స్వయంగా చెప్పాను. ఈ గబ్బును తెచ్చింది ఎవరు అండి ఈ కాంగ్రెస్ వాళ్లు కాదా…