నేడు హుజూర్‌నగర్‌లో సీఎం కేసీఆర్ బహిరంగ సభ - MicTv.in - Telugu News
mictv telugu

నేడు హుజూర్‌నగర్‌లో సీఎం కేసీఆర్ బహిరంగ సభ

October 26, 2019

 

kcr....

ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌ నగర్‌కు వెళ్లనున్నారు. ఇటీవల జరిగిన హుజూర్ నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఘనవిజయం సాధించిన నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణులు ధన్యవాద సభను నిర్వహిస్తున్నారు. అందులో కేసీఆర్ పాల్గొంటారు. కేసీఆర్ హుజూర్ నగర్ షెడ్యూల్ ఇలా ఉండబోతోంది. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ నుండి సూర్యాపేటకు బయల్దేరుతారు. మధ్యాహ్నం 1.30 నిమిషాలకు సూర్యాపేటలోని త్రివేణి గార్డెన్‌లో లంచ్ చేస్తారు. 

మధ్యాహ్నం 2 గంటలకు హుజూర్ నగర్ సభ ప్రాంగణానికి బయలుదేరుతారు. మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు హుజూర్ నగర్ నుండి హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతారు. రాత్రి 7.30 నిమిషాలకు ప్రగతి భవన్ చేరుకుంటారు. కేసీఆర్ సభ కోసం పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికలకు ముందు జరగాల్సిన సభ భారీ వర్షం కారణంగా రద్దైన సంగతి తెల్సిందే.