కేసీర్ ఉదారత.. అభ్యర్థుల వయోపరిమితి భారీగా పెంపు - MicTv.in - Telugu News
mictv telugu

కేసీర్ ఉదారత.. అభ్యర్థుల వయోపరిమితి భారీగా పెంపు

March 9, 2022

17

భారీ స్థాయిలో ఉద్యోగాలను ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… అదే స్థాయిలో అభ్యర్థుల గరిష్ట వయో పరిమితిని కూడా పెంచారు. దీంతో వయస్సు పైబడిన అభ్యర్థులకు ఎంతో మేలు జరుగనుంది. ఓసీ అభ్యర్థులకు గరిష్టంగా 44 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 49 ఏళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు 54 ఏళ్లు, మాజీ సైనికులకు 47 ఏళ్లకు పెంచినట్టు కేసీఆర్ తెలిపారు. ఈ ప్రకటనతో తెలంగాణ నిరుద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. కాగా, వయోపరిమితి పెంపు పోలీస్ ఉద్యోగాలకు మాత్రం వర్తించదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు ప్రకటించిన ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వాళ్టి నుంచే విడుదల చేస్తామని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. ఉద్యోగాల భర్తీ వల్ల ప్రభుత్వంపై ఏడాదికి దాదాపు రూ. 7 వేల కోట్ల భారం పడుతుందని అంచనా.