పదవి ఇస్తానంటే పారిపోతావా అని కేసీఆర్ అన్నారు (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

పదవి ఇస్తానంటే పారిపోతావా అని కేసీఆర్ అన్నారు (వీడియో)

August 30, 2019

15 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో ఏ ఒక్కరి నుంచి 5 రూపాయలు తీసుకున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని అన్న నికార్సయిన వ్యక్తిత్వం మంత్రి ఈటల రాజేందర్ సొంతం. తెలంగాణ కేబినెట్ నుంచి తనను తప్పిస్తారని జరుగుతున్న దుష్ప్రచారంపై ఆయన తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌లో ఫైర్ అయిన విషయం తెలిసిందే. మంత్రి పదవి బిక్ష కాదని… తాను బీసీని కాబట్టి కుల ప్రాతిపదికన మంత్రి పదవి కావాలని ఎప్పుడూ అడగలేదని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. 

2002 నుంచి కేసీఆర్‌తో తనకు సాన్నిహిత్యం వుందని మైక్ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. తెలంగాణ ఉద్యమకారుడిగా వున్న తనకు రాజకీయాలు కొత్తని.. 2003లో పల్లెబాట ముగింపు సమావేశంలో కేసీఆర్‌తో మరింత సాన్నిహిత్యం పెరిగిందని వివరించారు. ఆ తర్వాత కేసీఆర్ టికెట్ ఇవ్వడంతో ఎన్నికల్లో గెలిచాను. అనంతరం కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్ష పదవి చేపట్టమని కేసీఆర్ కోరితే చేయనని చెప్పానని వెల్లడించారు. ‘ఎవరైనా పదవుల కోసం కొట్లాడుతుంటే నువ్వేందయ్యా పదవి ఇస్తానంటే పారిపోతానంటున్నావ్’ అని కేసీఆర్ అనడంతో ఆ పదవి చేపట్టానని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు అనేక అవమానాలను ఎదురుకున్నామని.. తిట్లు తిన్నామని చెప్పారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని గెలిపించాలి.. కేసీఆర్‌ను నిలబెట్టుకోవాలని తాము చేసిన పని, అవలంభించిన తీరు కేసీఆర్‌ను మరింత దగ్గర చేసిందని వివరించారు. క్రింది లింకులో వీడియో చూడొచ్చు.