సంస్కరణల పేరుతో కేంద్రం దోచుకుంటుంది.. అమ్మేసుడే పనిగా పెట్టుకుంది.
అంబేద్కర్ తీసుకువచ్చిన రాజ్యాంగ స్ఫూర్తిని మోదీ ప్రభుత్వం రోజుకింత కాలరాస్తుందని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్ర అసెంబ్లీలో విద్యుత్ సంస్కరణలపై జరిగిన చర్చలో… వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇవ్వొద్దని బీజేపీ ఎక్కడా చెప్పలేదని ఆ పార్టీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. రఘునందన్‌రావు సభను తప్పదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా కేంద్రం విధానాలను ఎండగట్టారు. బీజేపీ కి…కేంద్రంకి మద్య ఏదో గ్యాప్ ఉన్నట్టుంది అని ఎద్దేవ చేశారు. బీజేపీ చెప్పే దానికి కేంద్రం చేసేదానికి తేడా ఉందని సీఎం మండిపడ్డారు. సంస్కరణ అనే అందమైన ముసుగు తొడిగి దోచుకుంటుంది కేంద్రం అన్నారు. అమ్మేసుడే పనిగా పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్టీసీని అమ్మేయండి అన్నది.. ఎవరు ముందు అమ్మితే వాళ్లకు వెయ్యి కోట్ల నజరానా ఇస్తారట అంటూ మండిపడ్డారు సీఎం కేసీఆర్. Rtc అమ్మేయండి అన్నది ఎవరు? ఎవరు ముందు అమ్మితే వాళ్లకు వెయ్యి కోట్ల నజరానా అంటా.. వడ్లు వెయ్యండి కొంటం అన్నారు. తీరా వేసిన తర్వాత కొంటాం అన్నోడు పత్తా లేకుండా పోయారన్నారు. పవర్..ఉమ్మడి జాబితా లోనిదని.. రాష్ట్రాలను అడగకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారన్నారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడకుండా చేస్తుంది కేంద్రమని.. అధికార పార్టీ సభ్యులు ఎక్కువ ఉండి ప్రతిపక్ష సభ్యులు మాట్లాడకుండా చేసింది బీజేపీ అని ఆగ్రహించారు. గెజిట్ లో.. లేదు అని రఘునందన్ రావు అబద్దం చెప్తున్నారు…. ఏపీలో మీటర్లు పెడితే కాలపెట్టారని గుర్తు చేశారు. తెలివితక్కువ కేంద్ర ప్రభుత్వమని… రైతుల నోట్లో కేంద్రం మట్టికొడుతుందని ఆగ్రహించారు. ఎక్కడ అయిన మేము చర్చకు రెడీ అని.. దేశంలో ప్రజాస్వామ్యము ఉండవద్దట …కొందరు బిజెపి నేతలు మాట్లాడతారని విమర్శలు చేశారు.