కేసీఆర్ సర్కార్ మరో నిర్ణయం.. ఫ్లాట్ల అమ్మకానికి ప్రకటన - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ సర్కార్ మరో నిర్ణయం.. ఫ్లాట్ల అమ్మకానికి ప్రకటన

May 5, 2022

తెలంగాణలో కేసీఆర్ సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో సొంత ఇళ్లు కొనాలని ఎదురుచూస్తున్న వారికి శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌లో ఉన్న బండ్లగూడ, పోచారంలోని స్వగృహ ఫ్లాట్లను అమ్మకానికి సర్వం సిద్ధం చేసింది. బండ్లగూడలో 1,501 ఫ్లాట్లు, పోచారంలో 1,470 ప్లాట్లకు ఈ వేలం ద్వారా అమ్మకానికి ప్రకటన విడుదల చేసింది. ఇళ్లు కావాలని ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

స్వగృహ ఫ్లాట్ల విక్రయాలపై బుధవారం సంబంధిత అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఫ్లాట్లు విక్రయ విధివిధానాల తుది రూపకల్పనపై చర్చించారు. అనంతరం ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ..”బండ్లగూడలో మొత్తం 1,501 ఫ్లాట్లు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. అందులో పూర్తి వర్క్స్‌లో ఉన్నవి 419. అసంపూర్తిగా ఉన్నవి 1,082. ఒక్కో ప్లాట్ రూ. 2,750 చొప్పున విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక పోచారంలో 1,328 ప్లాట్ల గజం రూ. 2500 విక్రయించనున్నాం. ఆసక్తిగల సాధారణ పౌరులు, ఉద్యోగులు www.swagruha.telangana.gov.in వెబ్‌సైట్‌లో ఆప్లై చేసుకోవచ్చు. దీనికి దరఖాస్తు ఫీజు వెయ్యి రూపాయలు చెల్లించాలి” అని ఆయన అన్నారు.