పేద దంపతులకు కేసీఆర్ సర్కార్ గుడ్‌న్యూస్ - MicTv.in - Telugu News
mictv telugu

పేద దంపతులకు కేసీఆర్ సర్కార్ గుడ్‌న్యూస్

May 25, 2022

తెలంగాణ రాష్ట్రంలో సంతానం కోసం వేల రూపాయలను ఖర్చు చేసుకుంటున్న పేద దంపతులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఆసుపత్రులలో త్వరలోనే సంతాన సాఫల్య కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు. మొదటగా ఏడున్నర కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేసి, దంపతులకు అందుబాటులోకి తీసుకొస్తామని వైద్యా ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు.

 

హరీశ్ రావు మాట్లాడుతూ.. ”గాంధీలో రెండున్నర కోట్లతో సంతాన సాఫల్య కేంద్రాన్ని పూర్తిస్థాయిలో త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తాం. మొదటగా రాష్ట్రంలో మూడుచోట్ల ఏడున్నర కోట్లతో సంతాన సాఫల్య కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. అందులో.. గాంధీ, పేట్లబుర్జ్‌తోపాటు వరంగల్‌లోని ఎంజీఎం దవాఖానల్లో ఈ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తాం. ఒక్కొక్కటి రెండున్నర కోట్లతో స్థాపించబోతున్నాం. ఈ సంతాన సాఫల్య కేంద్రం సంతానం లేనివారికి వరంగా మారనుంది. గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం ఫెర్టిలిటి ఒపి నడుస్తుంది. రోజుకి దాదాపు 40 జంటలు గాంధీ ఫెర్టిలిటీని సంప్రదిస్తున్నారు. అతి త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రైవేటుకు ధీటుగా గాంధీలో ఫెర్టిలిటీ విభాగం అందుబాటులోకి వస్తుంది” అని ఆయన అన్నారు.

మరోపక్క తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పెళ్లి అయ్యి కొన్ని ఏండ్లు గడుస్తున్నా పిల్లలు లేక దంపతులు నానా అవస్థలు పడుతున్నారు. సంతానం కోసం ప్రైవేట్ ఆసుపత్రులను సంప్రదిస్తున్నారు. ఈ క్రమంలో పలు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఏవేవో కారణాలను చూపుతూ, పేద దంపతుల దగ్గర వేలకు వేలు వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ ఆసుత్రుల చుట్టు తిరుగలేక, డబ్బులు కట్టలేక ప్రభుత్వ అధికారులకు వినతపత్రాలను అందించారు. వినతిపత్రాలపై చర్చలు జరిపిని వైద్యా ఆరోగ్యశాఖ రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో ఈ సంతాన సాఫల్య కేంద్రాలను ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.