కేసీఆర్ సర్కార్.. నివేదికలు ఇస్తారా? ఇవ్వరా?: తమిళిసై - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ సర్కార్.. నివేదికలు ఇస్తారా? ఇవ్వరా?: తమిళిసై

April 22, 2022

02

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నా తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఆత్మహత్యలపై సమగ్ర నివేదిక ఇస్తారా? ఇవ్వరా? అని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు ఆమెకు సమర్పించిన వినతి పత్రాలపై ఆమె తీవ్రంగా స్పందించారు.

వివరాల్లోకి వెళ్తే..ఇటీవలే ఖమ్మం జిల్లాలో సామినేని సాయిగణేశ్, కామారెడ్డి జిల్లాలో తల్లీకొడుకుల ఆత్మహత్యలకు పాల్పడ్డిన విషయం తెలిసిందే. ఆ రెండు ఆత్మహత్యలపై బీజేపీ నాయకులు పలు మీడియా, సోషల్ మీడియా కథనాలతోపాటు వినతి పత్రాలను గవర్నర్‌కు సమర్పించారు. దీంతో గురువారం సమగ్ర నివేదిక ఇవ్వాలని గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఇటీవల జరిగిన పరువు హత్యలు, సామూహిక అత్యాచారం వంటి ఇతర నేరాలపైనా కూడా వివరణ ఇవ్వాలని సూచించారు.

మరోపక్క రాష్ట్రంలోని పలు ప్రైవేటు వైద్యకళాశాలలు పీజీ సీట్లను.. అర్హులైన నీట్ ర్యాంకర్లకు కేటాయించకుండా బ్లాక్ చేసి అడ్డదారిలో విక్రయిస్తున్న వ్యవహారంపై గవర్నర్ తమిళిసై తీవ్రంగా స్పందించారు. తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టి, నివేదిక ఇవ్వాలని గురువారం కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతిని ఆదేశించారు. సీట్ల బ్లాక్ దందాపై ఆరోగ్య వర్సిటీ వీసీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.