Home > Featured > కాళేశ్వరానికి సుప్రీంకోర్ట్ బ్రేక్..

కాళేశ్వరానికి సుప్రీంకోర్ట్ బ్రేక్..

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కాళేశ్వరానికి పర్యావరణ అనుమతులు ఉన్నాయా? అంటూ కేసీఆర్ సర్కార్‌ను సుప్రీం ప్రశ్నిస్తూ, మూడో టీఎంసీ పనులపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది. ఇటీవలే కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణను వ్యతిరేకిస్తూ, భూనిర్వాసితులు పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పర్యావరణ అనుమతులు, డీపీఆర్‌ లేకుండా తెలంగాణ సర్కార్‌ ప్రాజెక్టు విస్తరణను నిర్మిస్తోందంటూ వేసిన పిటిషన్‌‌పై ఈరోజు ధర్మాసనం విచారణ చేపట్టింది.

విచారణలో భాగంగా.. కాళేశ్వరానికి పర్యావరణ అనుమతులు ఉన్నాయా? అని ప్రశ్నించింది. అనంతరం ఆపై తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ, ఆదేశాలు జారీ చేసింది. మరోపక్క గతంలో భూనిర్వాసితులు దాఖలు చేసిన పిటిషన్‌‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణ విషయంలో కేంద్రానికి, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది. ఈ క్రమంలో మొదటి విచారణకు సంబంధించి, కాళేశ్వరానికి పర్యావరణ అనుమతులు ఉన్నాయా? అంటూ కేసీఆర్ సర్కార్‌ను ప్రశ్నిస్తూ, మూడో టీఎంసీ పనులపై స్టే విధించింది.

Updated : 27 July 2022 3:18 AM GMT
Tags:    
Next Story
Share it
Top