‘నెరేళ్ల’పై కేసీఆర్ మార్క్..! - MicTv.in - Telugu News
mictv telugu

 ‘నెరేళ్ల’పై కేసీఆర్ మార్క్..!

August 22, 2017

నేరళ్లలో దళితులపై జరిగిన దాడిపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందన్న ఆరోపణలను తిట్టికొట్టేందుకు బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశించారు. ఈ ఘటనను ఆయన తీవ్రంగా పరిగణించారు. బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములుతో రహస్యంగా నివేదిక తెప్పించుకుని వాస్తవాలను పరిశీలించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ దాడిపై కొందరు పోలీసు, ఇతర శాఖల ఉన్నతాధికారులు వాస్తవాలను దాచిపెట్టి ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించారని, నేరేళ్ల వివాదానికి వారి తీరే ప్రధాన కారణమని రాములు నివేదిక స్పష్టం చేసింది.

చర్యల్లో భాగంగా సిరిసిల్ల ఎస్పీ విశ్వజిత్ ను సాగనంపాలని, ఆయనకు రాష్ట్రంలో పోస్టింగ్ ఇవ్వొద్దని సీఎం ఆదేశించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో జిల్లాకు త్వరలోనే కొత్త ఎస్పీ రానున్నారని వార్తలు వస్తున్నాయి. విశ్వజిత్ గురువారం నుంచి శిక్షణ కోసం లఖడ్ వెళ్లనున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.  నేరళ్ల ఘటనపై దళిత, ప్రజాసంఘాలు చేసిన ఆందోళలు, ధర్నాలపై ప్రభుత్వం స్పందించడం హర్షణీయం.