కేసీఆర్‌కు సోదరీ వియోగం - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్‌కు సోదరీ వియోగం

February 21, 2018

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు సోదరీ వియోగం కలిగింది. ఆయన రెండో అక్క పి. విమాలబాయి(82) బుధవారం ఉదయం హైదరాబాద్లో కన్నుమూశారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.ఆమె మృతితో కేసీఆర్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. విమలాబాయి అంత్యక్రియలను ఈ రోజు మధ్యాహ్నం అల్వాల్‌లో శ్మశాన వాటికలో నిర్వహిస్తారు. కేసీఆర్ కు మొత్తం 10 మంది తోబుట్టువులు. వీరిలో 9 మంది అక్కలు, ఒక అన్న, ఒక చెల్లి ఉన్నారు.