Kcr slams on bjp for joining proposal of kalvakuntla Kavita
mictv telugu

కవితను పార్టీ మారమన్నారు.. కేసీఆర్ సంచలన ప్రకటన

November 15, 2022

సార్వత్రిక ఎన్నికలకు పది నెలల సమయమే ఉందని, పార్టీ శ్రేణులు పోరుకు సిద్ధం కావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. మంగళవారం టీఆర్ఎస్ భవన్‌లో జరిగిన పార్టీ విస్తృత సమావేశంలో ఆయన ప్రసంగించారు. శ్రేణులకు ఉత్సాహం రేకెత్తిస్తూ సంచలన ఆరోపణలు కూడా చేశారు. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు భయపడొద్దని, బీజేపీపై అన్ని శక్తులను ధారపోసి పోరాడాలని అన్నారు. ఈడీ దాడులు చేస్తే తిరగబడాలని చెప్పారు.

‘‘బీజేపీతో పోరాడి తీరాల్సిందే. షెడ్యూలు ప్రకరామే ఎన్నికలు జరుగుతాయి. ఎన్నో కష్టాలు వస్తాయి. బీజేపీ నాయకులు మన పార్టీ ఎమ్మెల్యేలను కొనాలని ప్రయత్నించారు.  నా కూతురిని పార్టీ మారమని కోరారు. ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉంటుందా? మీరు అధైర్యపడకండి. మన ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి. ఎన్నికలకు పది నెలల గడువే ఉంది. ఈ రోజు నుంచి ఎమ్మెల్యేలంతా ఫీల్డులో ఉండాలి. ఇది ఎన్నికల ఏడాది’’ అని సీఎం అన్నారు. వంద ఓటర్లకు ఒక ఇన్‌చార్జిని నియమించుకోవలని, నిజయోజకర్గాల్లోని సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశ వివరాలు పూర్తిగా తెలియడం లేదు. భేటీలో స‌మావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా పరిషత్, డీసీసీబీ, రైతుబంధు జిల్లా కమిటీ బాధ్యులు పాల్గొన్నారు.