ఇండియాలోనే ఇంత చెత్త సచివాలయం లేదు - MicTv.in - Telugu News
mictv telugu

ఇండియాలోనే ఇంత చెత్త సచివాలయం లేదు

November 1, 2017

కొత్త సచివాలయం నిర్మాణంపై  అసెంబ్లీలో  చర్చ జరుగుతోంది. దీనిపై కేసీఆర్ మాట్లాడుతూ, భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో  ఉన్న సచివాలయాలలో మనదే చెత్త సచివాలయం అని కేసీఆర్ అన్నారు.  సచివాలయంలోని ఏ ఒక్క భవనం కూడా నిబంధనలకు అనుకూలంగా లేవు. చివరికి ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న సీ బ్లాక్ కూడా అధ్వానంగా ఉందన్నారు. అగ్ని ప్రమాదం జరిగితే అగ్నిమాపక యంత్రాలు వచ్చే పరిస్థితి కూడా లేదన్నారు.  రాష్ట్ర ప్రభుత్వానికి  సచివాలం గొప్ప  సూచికగా  ఉండాలి. అందుకే కొత్త సచివాలయం నిర్మించాల్సిన అవసరం  ఎంతైనా ఉందని  కేసీఆర్  అన్నారు.