Kcr speech on peddapalli collectorates slams modi
mictv telugu

మోదీ ఓ గోల్‌మాల్, అతనికి మీటరు పెట్టాలి.. కేసీఆర్ ఫైర్

August 29, 2022

‘‘తెలంగాణ రైతులకు దేశంలో ఎక్కడా లేని మేం మేలు చేస్తుంటే కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి కన్నుకుడుతోంది. మోదీ ముందుచూపు లేకపోవడం వల్ల దేశం కడగండ్లపాలైంది. అతడు ఓ గోల్‌మాల్. 12 లక్షల ప్రజాధనాన్ని కార్పొరేటర్లకు దోచిపెట్టారు. ధాన్యం కొనుగోలు చేయమంటే చేయలేదు. దేశ ఆర్థిక వ్యవస్థను పతనం చేసి ప్రజల ఉసురు పోసుకుంటున్నారు’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ దుమ్మెత్తి పోశారు. ఆయన సోమవారం పెద్దపల్లిలో కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించి, అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అంశాలను ప్రస్తావిస్తూ బీజేపీపై విమర్శలు గుప్పించారు.

‘‘మతపిచ్చిగాళ్లను నమ్మి మోసపోతే గోస పడతం. గుజరాత్ మోడల్ అని చెప్పి మోదీ దేశప్రజలను దగా చేశారు. అతనికి అసలు తెలివుందా? గాంధీ పుట్టిన గుజరాత్‌లో కల్తీ మద్యం ఏరులై పారి 75 మంది చనిపోయారు. దీనికి మోదీ సమాధానం చెప్పాలి. రైతుల మీటర్లకు బోర్లు పెట్టాలి బీజేపీ ఒత్తిడి చేస్తోంది? దీనికి ఒప్పుకోబోమని ప్రజలు అంటున్నారు. మోదీ దుర్మార్గాలను అడ్డుకోవాలని ఢిల్లీకి వెళ్లి కొట్లాడాలి. బోర్లకు కాదు, మోదీకి మీటరు పెట్టాలి. మేం నీళ్లు పారిస్తుంటే నెత్తురు పారిస్తామని వస్తున్న ఢిల్లీ ఏజెంట్ల ఊర్లకు రాకు తరిమికొట్టాలి’’ అని కేసీఆర్ విరుచుకుపడ్డారు.