ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్స్ పంపిణీ కార్యక్రమం విజయవంతం - MicTv.in - Telugu News
mictv telugu

ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్స్ పంపిణీ కార్యక్రమం విజయవంతం

May 27, 2017

 

ఎల్పీ సమావేశం అంటే జనరల్ గా ప్రజా సమస్యలపై ఎజెండా ఫిక్స్ చేసుకోవడం కోసం నిర్వహించుకునే కార్యక్రమం.ఈ సంప్రదాయాన్ని ఇప్పుడు కేసీఆర్ మార్చేశారు. శాసనసభా పక్ష సమావేశం ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్స్ పంపిణీకి వేదికగా మారింది. ఎమ్మెల్యేల పనితీరుకు పర్సంటేజ్ లు ఇచ్చేశారు. కేసీఆర్ అంతర్జాతీయ స్థాయిలో పేరున్న ఓ ప్రైవేట్ సర్వే ఏజెన్సీ.తో ..తమ ప్రభుత్వ పనితీరుపై వాకబు చేయించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
119 అసెంబ్లీ సీట్లకు గానూ టీఆర్‌ఎస్‌కు 111, మిత్రపక్షం ఎంఐఎంకు 6 సీట్లు, విపక్షాలకు కేవలం 2 సీట్లు వస్తాయని సర్వేలో తేల్చారు.
ఈ సమావేశంలో చాలా ఎమోషనల్ గా మాట్లాడిన కేసీఆర్ …ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 111 సీట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ గెలిచే రెండుస్థానాలను చెప్పకనే చెప్పేశారు. ఖమ్మం జిల్లాలోని మధిర ,నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తిలో మాత్రం టీఆర్ ఎస్ గెలిచే పరిస్థితి లేదన్నట్టు సమాచారం. ఈ సారి గతంలో మాదిరిగా కాకుండా 70శాతం గెలిచే అవకాశాలు ఉన్న స్థానాలు 13, 50శాతం గెలిచే స్థానాలు 31, మిగతావి అన్ని 40శాతం లోపు గెలుపు అవకాశాలున్న స్థానాలుగా సర్వే తేల్చినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ , మంత్రులు కేటీఆర్ , హరీష్ రావు ల పనితీరుపై పర్సెంటేజ్ లను మీడియాకు లీక్ చేశారు. సీఎం కేసీఆర్ కు 98శాతం, కేటీఆర్ కు 91శాతం..హరీష్ రావు 88శాతం స్కోర్ చేశారు.

ప్రధానంగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై ఈ భేటీ చర్చించింది. అయితే తటస్థంగా ఉండాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కానీ ఎవరైనా తమను సంప్రదిస్తే వారి ప్రతిపాదనలు విన్న తర్వాత మద్దతుపై ఆలోచించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.