కాంట్రాక్ట్ ఉద్యోగులకు కేసీఆర్ తీపికబురు - MicTv.in - Telugu News
mictv telugu

కాంట్రాక్ట్ ఉద్యోగులకు కేసీఆర్ తీపికబురు

March 9, 2022

loki

తెలంగాణలో ప్రస్తుతం మొత్తం 91,142 ఖాళీలు ఉన్నాయని, అందులో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పోగా.. మిగిలిన 80,039 పోస్టులకు ఇవాళ్టి నుంచే నోటిఫికేషన్లు విడుదల చేస్తామని బుధవారం కేసీఆర్ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నామని కేసీఆర్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నో సంవత్సరాలుగా వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో చెప్పలేని ఆనందం మొదలైంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమ కల నేరవేరిందని కాంట్రాక్ట్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరోపక్క పోలీస్ శాఖ మినహా ఉద్యోగార్థుల వయోపరిమితిని మరో 10 పదేళ్లకు పెంచుతున్నట్లు వెల్లడించారు. 95 శాతం ఉద్యోగాలు స్థానికులే దక్కేలా రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చామని దీనివల్ల అందరికీ అవకాశాలు వస్తాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. షెడ్యూల్ 9, 10 సంస్థల వివాదం పరిష్కారమైతే.. అక్కడ కూడా అవకాశాలు వస్తాయని తెలిపారు. మరో 10 నుంచి 20వేల ఉద్యోగాల ఉద్యోగాలు వచ్చే అవకాశముందని తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ తెలిపారు.