గ్రూపు-1 అభ్యర్థులకు కేసీఆర్ తీపికబరు - MicTv.in - Telugu News
mictv telugu

గ్రూపు-1 అభ్యర్థులకు కేసీఆర్ తీపికబరు

May 21, 2022

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే విడుదలైన గ్రూప్-1 ఉద్యోగాలకు సంబంధించి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రూపు-1లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు (డీఎస్పీ) పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల ఎత్తు అర్హతను 167 సెంటీ మీటర్ల నుంచి 165కు తగ్గిస్తూ అధికారులు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.

ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ..” డీఎస్పీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల విషయంలో కేసీఆర్ ఎత్తు అర్హతను 167 సెంటీ మీటర్ల నుంచి 165కు తగ్గించారు. పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి, దరఖాస్తు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. వాస్తవానికి ఈ పోలీసు ఉద్యోగాలకు శుక్రవారం రాత్రి 10 గంటల వరకే దరఖాస్తుల అవకాశం ఉండే, కానీ కేసీఆర్ సమావేశం పెట్టి, గడువును ఈనెల 28 రాత్రి 10 గంటల వరకు పెంచారు” అని ఆయన అన్నారు.

మరోపక్క ఈ పోలీసు ఉద్యోగాలకు సంబంధించి, ఇప్పటికే రాష్ట్రం ప్రభుత్వం మూడేళ్ల సడలింపు ఇచ్చింది. తాజా పెంపుతో మొత్తం సడలింపు అయిదేళ్లకు పెరిగింది. కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపికకు కనిష్ఠ వయసు 18 సంవత్సరాలు (జులై 1, 2022 నాటికి), గరిష్ట వయోపరిమితి 22గా ఉంది. గరిష్ట వయసు 25 అయింది. తాజాగా రెండేళ్ల సడలింపుతో ఇది 27 ఏళ్లు అయింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వుడ్ అభ్యర్ధులకు మరో అయిదేళ్లు సడలింపు ఉన్న నేపథ్యంలో గరిష్ఠ వయోపరిమితి 32 ఏళ్లకు చేరింది. ఎస్సై ఉద్యోగాలకు కనిష్ఠ వయసు 21 సంవత్సరాలు (జులై 1, 2022 నాటికి), గరిష్ట వయోపరిమితి 25గా ఉంది. అది ఇప్పుడు 30 ఏళ్లు అయింది. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్యుడ్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 35 ఏళ్లకు చేరింది.