KCR Target100 MP Seats In 2024 Elections
mictv telugu

కేసీఆర్ టార్గెట్100…రీచ్ అవుతారా?

November 8, 2022

లోక్‌సభ ఎన్నికల్లో వంద సీట్లలో బీఆర్ఎస్ పోటీ చేయబోతుందా? నాలుగు రాష్ట్రాలపైనే నజర్ పెట్టిందా? ఏయే పార్టీతో కలిసి అడుగులు వేయబోతోంది? కారు కాన్వాయ్‌తో కలిసి వచ్చేదెవరు? ఆ రాష్ట్రాల్లో బీఆర్ఎస్‌కు ఎంత స్కోప్ ఉంది. బీజేపీపై ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా?లేదంటే కాంగ్రెస్‌కు నష్టమా?

మిషన్ 2024
మిషన్ 2024 పై సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టారు. బీఆర్ఎస్‌ను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళిక రచించారు. నాలుగు రాష్ట్రాలు, వంద సీట్లు టార్గెట్‌గా పెట్టుకున్నారు. తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకలో పోటీ చేయాలని ఆలోచిస్తున్నారు.ఇందుకోసం బలమైన నేతల్ని అన్వేషిస్తున్నారు. వచ్చే నెల 7న బీఆర్ఎస్ పేరు అధికారికంగా ఖరారు అవుతోంది. .ఆ రోజే పూర్తి వివరాల్ని సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని పార్టీ నేతలు చెప్పారు. బీఆర్ఎస్ ఎక్కడెక్కడ పోటీ చేస్తుంది..?ఏయే పార్టీలతో కలిసి పనిచేస్తుందనే దానిపై క్లారిటీ ఇస్తారు.

అన్వేషణ

ఏపీ, మహారాష్ట్ర ,కర్ణాటకలో అభ్యర్థుల కోసం అన్వేషణ టీఆర్ఎస్ మొదలు పెట్టింది. సామాజిక, ఆర్థిక పరపతి ఉన్న నాయకుల కోసం చూస్తుంది. బీఆర్ఎస్‌ని గెలిపించే సత్తాతోపాటు ఎన్నికల ఖర్చు భరించే అభ్యర్థుల్ని ఎంపిక చేయబోతోంది. పెద్ద నియోజకవర్గాల్లో 95లక్షలు ఎన్నికల ఖర్చుకు అధికారికంగానే అనుమతి ఉంది. చిన్న నియోజకవర్గాల్లో 75 లక్షల లిమిట్ ఉంది. ఇంతకు మించి పెట్టేవారి కోసం బీఆర్ఎస్ ఎదురు చూస్తుంది.

ఆ మూడు రాష్ట్రాల్లో…

ఏపీలో కేసీఆర్ అంటే క్రేజ్ ఉంది. కేసీఆర్ చేసిన పనులు మెచ్చి గతంలో పాలాభిషేకాలు చేశారు.పలుచోట్ల ఏపీ నాయకులతో పాటు కేసీఆర్ ఫ్లెక్సీలు వెలిశాయి. ఏపీ నేతలతోనూ కేసీఆర్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇది బీఆర్ఎస్‌కు కలిసి వస్తుందని ఆపార్టీ నేతలు భావిస్తున్నారు. అటు సీఎం జగన్‌తో కేసీఆర్‌కు సత్సంబంధాలే ఉన్నాయి. రెండు, మూడు సార్లు కలిసి ఆప్యాయంగా పలుకరించుకున్న సందర్భలూ ఉన్నాయి. మరి బీఆర్ఎస్ జగనతో కలిసి పోటీ చేస్తుందా? లేదా ఒంటరిగానే పోటీ చేస్తుందా అనేది ఆసక్తి కలిగించే అంశమే.

కర్ణాటక,మహారాష్ట్రల్లో…

ఇక కర్ణాటకలో జేడీయూ నేత కుమార్ స్వామితో కేసీఆర్‌కు మంచి స్నేహం ఉంది. ఏ విషయంలోనైనా బీఆర్ఎస్‌కు సపోర్ట్ చేయడానికి జేడీయూ రెడీగా ఉంది. సో ఇక్కడ కుమారస్వామితోనే కలిసి బీఆర్ఎస్ పక్కా పోటీ చేస్తుంది. మహారాష్ట్రలో శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరేతో కేసీఆర్‌కు దోస్తీ ఉంది. ఇక్కడ కూడా ఆ పార్టీతో కలిసి అడుగులు వేస్తారు. ఈ రెండు రాష్ట్రాల్లో తెలంగాణ సరిహద్దు నియోజక వర్గాలపైనే బీఆర్ఎస్ ఫోకస్ చేస్తుంది. 2024 ఎన్నికలకు సమయంతో ఉండటంతో పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని కేసీఆర్ సేన భావిస్తోంది. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రజావ్యతిరేక విధానాల్ని ఎండగట్టేందుకు కలిసి వచ్చేవారితో ముందుకెళ్లాలని యోచిస్తోంది.